ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 45 డివిజన్ లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్ధం

ఆగష్టు 04 ఖమ్మం:

ఖమ్మం నగరాన్ని సుందర నగరంగా, గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం జరిగిందని నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో సువిశాలమైన అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగిందని ( రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం 45 వ డివిజన్లో రూ.13. లక్షలతో మామిళ్ళ గూడెం సాయిబాబా టెంపుల్ నుండి ప్రధాన రహదారికి అనుసంధానం చేస్తు నిర్మించనున్న సిసి రోడ్డుకు మంత్రి కొబ్బరికాయ కొట్టి శంఖుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. ఆయా డివిజన్లలో ఇంకా కావలసిన మౌళిక వసతులను గుర్తించి తన దృష్టికి తెచ్చినట్లయితే వాటన్నింటిని పూర్తి చేసుకొని ఖమ్మం నగరాన్ని రాష్ట్రంలోనే మరింత సుందరనగరంగా అభివృద్ధి చేసుకుంటూ నగరంలో అన్ని డివిజన్లలో అంతర్గత రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ, జంక్షన్లు, ఫౌంటేన్లు, ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పోరేటర్లు బుడిగిం శ్రీనివాస్, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, దోరేపల్లి శ్వేత, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ మున్సిపల్ డి. ఇ స్వరూపరాణి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post