ఖమ్మం నియోజకవర్గంలో నేటి వరకు 50 కోట్ల 4 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

ప్రచురణార్ధం .

అక్టోబరు 31,ఖమ్మం:

పేదింటి ఆడపడుచు పెండ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ/షాదిముబారక్ క్రింద ఖమ్మం నియోజకవర్గంలో నేటి వరకు 50 కోట్ల 4 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం రఘునాథపాలెం రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 31 మంది లబ్ధిదారులకు రూ.31,03,596 కళ్యాణలక్ష్మీ/పాదిముబారక్ చెక్కులను మంత్రి అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద నిరుపేదలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అన్నారు. పెద్ద నిరుపేద కుటుంబాల ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే సంకల్పంతో గౌరప రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలోచన చేసి కళ్యాణ లక్ష్మీషాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, వైస్ చైర్మన్ కె.వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, తహశీల్దారు నర్సింహారావు, సర్పంచ్లు గుడిపూడి శారద, రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post