ఖాళీగా ఉన్న చౌకదుకాణాలకు డీలర్లు నియామకానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ప్రతి పిర్యాదుకు అధికారులు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పారు. వచ్చే వారం ప్రత్యేకంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేకంగా రివ్యూ నిర్వహిస్తానని చెప్పారు. సమస్య పరిష్కారంలో అధికారులు జాప్యం చేయొద్దని చెప్పారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు అందచేసిన ఫిర్యాదులు కొన్ని: దుమ్ముగూడెం మండలం, పెద్దనల్లబల్లి గ్రామానికి చెందిన పాయం వెంకటలక్ష్మి అనే దివ్యాంగురాలు తాను ఏయనిం కోర్సు పూర్తి చేసి యున్నానని, పినపాకలోని బాలికల మినీ గురుకులంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఏయన్యం పోస్టు ఇప్పించాలని దరఖాస్తు చేశారు. కొత్తగూడెం మండలం, మేదరబస్తీకి చెందిన అప్పాల రాజేశ్వరి వార్డు నెం. 25 లోని సర్వే నెం. 142లోని ఇంటి నెం.7-5-69/ 1, గల ఇంటికి క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్నానని, 50.చ.గ. కలిగిన స్థలం 19.25 చ.గ.లు. నమోదు చేశారని, రికార్డులను పరిశీలించి 50 చ.గ.లకు పట్టా మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు | నిమిత్తం కొత్తగూడెం తహసిల్దార్‌కు ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మండలం, బర్మాక్యాంపుకు చెందిన వేకుల ప్రైజీ 35 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నానని, సెప్టెంబర్‌లో వచ్చిన వర్షాలకు ఇల్లు కూలిపోయిందని, అధికారులు పరిశీలనకు వచ్చారు కానీ నేటి వరకు పరిహారం అందలేదని చేసిన పిర్యాదను పరిశీలించిన కలెక్టర్ బాధితునికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసిల్దారు ఆదేశించారు. పాల్వంచ మండలానికి చెందిన కోమరాజుల రమణయ్య పాల్వంచ గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామాటి విధులు నిర్వహిస్తున్నానని, పూర్తి అందుడను కావడం చేత తన విధులను వేరే వ్యక్తులతో చేపిస్తున్నానని, సదరు వ్యక్తులు విధి నిర్వహణలో అంకితభావం లోపించినందున ఇబ్బందులు పడుతున్నానని, తన పరిస్థితిని పరిశీలించి తనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఐటిడిఏ అధికారులకు ఎండార్స్ చేశారు. పాల్వంచ వెంకటేశ్వర హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు తమ కాలనీలో ప్రధాన, అంతర్గత రహదారులు నిర్మించాల్సి ఉన్నదని, వర్షాకాలంలో నీరు నిలిచి, రోడ్డు గుంతలు ఏర్పడుతున్నాయని, శాశ్వత రోడ్లు నిర్మించాలని, విద్యుత్ పోల్స్ దీపాలు ఏర్పాటు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. చండ్రుగొండ మండలం, సుంకరబంజర గ్రామానికి చెందిన బాణోతు నాగమణి గతంలో తనకు 18వ నెంబరు రెండు పడక గదుల ఇంటిని కేటాయించారని, ఇటీవల తహసిల్దార్ తయారు చేసిన జాబితాలో తన పేరును తొలగించారని విచారణ నిర్వహించి తనకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేపించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం చండ్రుగొండ తహసిల్దార్‌కు ఎండార్స్ చేశారు.. చుంచుపల్లి మండలం, గౌతంపూర్‌కు చెందిన చెవుల బాలక్రిష్ణ పుట్టు గుడ్డివాడినని, నివాస గృహం లేక ఇబ్బందులు పడుతున్నానని, తనకు త్రీ ఇంక్లేన్లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్లలో వికలాంగుల కోటాలో ఇంటిని కేటాయించాలని చేసిన ధరఖాస్తును తగు చర్యలు నిమిత్తం చుంచుపల్లి తహసిల్దార్‌కు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post