గంగాధర మండలంలోని బురుగు పల్లి గ్రామంలో రైతులు యాసంగి సీజన్ లో వరికి బదులు సాగు చేస్తున్నా ఆరుతడి పంటలను మరియు గంగాధర మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్. (కరీంనగర్ జిల్లా)

యాసంగిలో  ప్రత్యామ్నాయ పంటల వల్లనే రైతులకు మేలు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

గంగాధర  మండలం     బూరుగుపల్లి లో ప్రత్యామ్నాయ పంటలు  పరిశీలించిన కలెక్టర్

000000

యాసంగి లో   ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు      మేలు కలుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు.

మంగళవారం గంగాధర మండలం లోని బూరుగుపల్లి గ్రామంలో  రైతులు వేసిన టమాటో, మినుము తదితర పంటలను కలెక్టర్ పరిశీలించి రైతులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్మారి రమేష్ అనే యువ రైతు కౌలుకు తీసుకున్న  రెండు ఎకరాల్లో టమాట పంటను వేసి మంచి దిగుబడిని సాధించి అధిక లాభం పొందడం అభినందనీయమన్నారు. వరి కి బదులు రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే సాగి హనుమంతరావు పది ఎకరాల్లో మినుము పంట  వేయడాన్ని అభినందించారు.
యాసంగిలో  కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సి ఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయదని   తెలిపారు.  యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయదనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా రైతులు సాగు చేస్తున్న కూరగాయల పంటలకు
చీడ పురుగులు ఆశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రైతులకు సూచించారు. వరికి బదులు  మినుములు కందులు, జొన్నలు, నువ్వులు  తదితర లాభసాటి పంటలు వేసుకోవాలని  తెలిపారు.  ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి సరిపడా  విత్తనాలను రైతులకు అందిస్తామని కలెక్టర్ అన్నారు. కూరగాయల పంటల్లో టమాటాతో పాటు బీర, కాకర, ఉల్లి, అల్లం, చిక్కుడు లాంటి  పంటలను కూడా సాగు చేసుకోవాలని  అన్నారు.

కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఏ డి ఏ రామారావు, గంగాధర తాసిల్దార్ శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పుల్కo గంగయ్య,  బూరుగుపల్లి సర్పంచ్ సాగి రమ్య, రైతులు ఉన్నారు.

ముందుగా గంగాధర మండల కేంద్రంలోని గంగాధర ప్రాథమిక   ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.  కోవిడ్ మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషన్  ఎంత వరకు అయ్యాయని వైద్యాధికారులను  అడిగి తెలుసుకున్నారు. మండలం లో 100 శాతం వ్యాక్సినేషన్ రెండవ డోసు ను డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తిచేయాలని వైద్య అధికారులను  ఆదేశించారు.

Share This Post