గంజాయి సాగును అరికట్టాలి – జిల్లా కలెక్టర్ హరీష్

గంజాయి సాగును అరికట్టాలి  – జిల్లా కలెక్టర్ హరీష్

పంట పొలాలలో గంజాయి సాగుచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ హెచ్చరించారు. మంగళవారం తన ఛాంబర్ లో గంజాయి సాగు, కోవిడ్ వ్యాక్సినేషన్ పై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా పంట పొలాల్లో గంజాయి సాగుచేస్తే ప్రభుత్వ పధకాలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రధానంగా జిల్లాలోని రేగోడ్, అల్లాదుర్గ్ మండలాల్లో అక్రమ గంజాయి సాగుచేస్తున్న ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 1283 మొక్కలను ధ్వంసం చేశామని ఆబ్కారీ అధికారి, అల్లాదుర్గ్ మండలంలోని వెంకట్రావుపేట్ కు చెందిన చాకలి రాములు సరై నెంబర్ 27 లో సాగు చేస్తున్న 78 మొక్కలను ధ్వంసం చేశామని అడిషనల్ ఎస్పీ కలెక్టర్ కు తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయత్ కార్యదర్శులు కూడా క్షేత్ర స్థాయిలో పంట పొలాలను పరిశీలించి గంజాయి సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారమందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో హవేలీ ఘనపూర్, రేగోడ్, అల్లాదుర్గ్ తదితర మండలాలలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారముందని, అట్టి గంజాయి సాగును అరికట్టుటలో పొలిసు, ఆబ్కారీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సాగు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, అవసరమైతే పి .డి. యాక్ట్ క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా పంట పొలాలలో గంజాయి సాగు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే పోలీసులకు గాని, ఆబ్కారీ శాఖకు గాని తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ కోరారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ గురించి సమీక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి 100 శాతం అర్హులకు వ్యాక్సినేషన్ వేసేలా చూడాలని జిల్లా వైద్యా శాఖాధికారి సూచించారు. జిల్లాలో 5 లక్షల 48 వేల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 4 లక్షల 25 వేల మందికి వ్యాక్సిన్ వేశామని, ఇంకా సుమారు లక్షా 20 వేల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వవలసి ఉందని అన్నారు. మళ్ళి అక్కడక్కడా కరోనా కేసులు నమోదవుతున్నందున ఇంకా మొదటి డోసు వేసుకొని వారిని గుర్తించి, టీకా పట్ల భయాందోళనలు, అపోహలను తొలగించే విధంగా అవగాహన కలిగించి శతశాతం వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలని అన్నారు.
మెదక్ పట్టణంలోని స్టేడియం పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, అడిషనల్ ఎస్పీ కృష్ణ మూర్తి, జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, ఆబ్కారీ శాఖా సూపరింటెండెంట్ రజాక్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, డ్డి.ఏం.అండ్ హెచ్.ఓ. వెంకటేశ్వర్ రావు, డి.ఎస్.ఓ. శ్రీనివాస్ , జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, డి.ఈ.ఓ. రమేష్ కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post