గంజాయి సాగు చేసినా, విక్రయించినా పిడి యాక్టు కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో గంజాయి, గుడుంబా నియంత్రణ, ఇసుక రీచ్లు ఏర్పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. గంజాయి, గుడుంబాను ఉక్కుపాదంతో తుదముట్టించాలని ఆయన పేర్కొన్నారు. గంజాయి వల్ల యువత పెడదోవ పడుతున్నట్లు గమనించిన ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచి వేయు విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. చెకోపోస్టులు వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు ద్వారా పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. గంజాయి, గుడుంబా నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. గంజాయి సాగు చేస్తున్నా, రవాణా చేస్తున్నా ప్రజలు యంత్రాంగానికి సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారిని ఆదేశించారు. గంజాయి రవాణా చేయు వాహనాలను సీజ్ చేయడంతో పాటు పిడి యాక్టు నమోదు. చేయాలని చెప్పారు. విస్తుృత తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. మండల ప్రత్యేక అధికారులు మండల పర్యటనల్లో ఈ అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆయన సూచించారు. మన జిల్లాను గంజాయి, గుడుంబా రహిత జిల్లాగా తయారు చేయుటకు ప్రజల సహాకారం కావాలని, ఎక్కడైనా గంజాయి సాగు చేపట్టినా, వినియోగిస్తున్నట్లు తెలిసినా. తక్షణమే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మాదక ద్రవ్యాలను ఉక్కుపాదంతో అణిచివేయకపోతే ప్రజలకు హాని జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రస్తావిస్తూ జిల్లాలో ఇంకనూ 3 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నట్లు చెప్పారు. ఆళ్లపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు మండలాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన జరుగుతున్నదని, మండలం ప్రత్యేక అధికారులు ముమ్మరం చేయాలని చెప్పారు. రేషన్ డీలర్స్, ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల గృహాలను గర్తులు వేయాలని చెప్పారు. జిల్లాలో 280 టీములు ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నడని ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్ ప్రక్రియపై గ్రామాలు, పట్టణాల్లో టాం.. టాంలు వేయించడంతో పాటు మైకుల ద్వారా విస్తుృత ప్రచారం నిర్వహించాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా వైద్యాధికారి, డిఆర్డిఓ డిఎస్ఓ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి, ఆర్ టిఓ వేణు, జిల్లా వైద్యాధికారి ఆక్టర్ శిరీష, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, సీఈఓ విద్యాలత, డిపిఓ రమాకాంత్, డిఎస్ఓ చంద్రప్రకాశ్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post