గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు జిల్లా కలెక్టర్ సి.హెచ్.శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 25: జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి హెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరంగా వచ్చె అన్ని సౌకర్యాలు నిలిపివేస్తామని భూమి యెక్క పట్టా రద్దు చేసి రైతు భీమా,బందు తదితర ప్రభత్వపరంగా లభించే అన్ని సౌకర్యాలు నిలిపివేస్తామని కలెక్టర్ అన్నారు డిసిపి బి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 50 అనుమానిత ప్రదేశాలను గుర్తించి గంజాయి పట్టివేత కు 25 ప్రత్యేక పోలీస్ బృందాలు (5) ఎక్సైజ్ బృందాల ను ఏర్పాటు చేసి సాగు దారుల పై , అమ్మే వారి పై, సేవించే వారిపై, కఠిన చర్యలు తీసుకుని పి డి యాక్టు, రౌడీ షిట్ నమోదు చేస్తామని అన్నారు కావున అందరూ గంజాయికి దూరంగా ఉండాలనీ కోరారు.
——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయడమైనది.

Share This Post