గంజాయి సాగు దారులపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.

గంజాయి సాగుపై గ్రామ స్థాయి నుండి పటిష్ఠ పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ, అటవీ, రెవిన్యూ, పంచాయతి అధికారులకు సూచించారు. గంజాయి సాగు చేస్తే అటువంటి రైతులకు రైతుబందుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు నిలుపుదలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజలు మత్తుకు అలవాటు పడి నిండు జీవితం నాశనం చేసుకుంటున్నారని, అలవాటును మానుకోలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇప్పిస్తామని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, రవాణా, వినియోగం, విక్రయాలు నిర్వహించే వ్యక్తుల సమాచారం తెలియచేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08744-241950 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుతో పాటు సమాచారం కానీ వీడియోలు కానీ సందేశం ద్వారా  పంపుటకు 9392919743 నంబర్ తో  వాట్స్ అప్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గంజాయిపై సమాచారం ఇచ్చిన ప్రజల వివరాలు పూర్తి గోప్యతను పాటించడం జరుగుతుందని, ఎవరికి బయపడకుండా నిర్బయంగా సమాచారం ఇవ్వాలని, గంజాయి సాగు, వినియోగం, రవాణా చేయుట పూర్తి నిషేధమని,  మన ప్రజల ఆరోగ్య సంరక్షణలో  ప్రజల సహకారం అందించాలని ఆయన కోరారు.

Share This Post