*గంభీరావుపేట మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *వ్యాక్సినేషన్ ప్రక్రియ, అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీ పాఠశాల తనిఖీ

*గంభీరావుపేట మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *వ్యాక్సినేషన్ ప్రక్రియ, అంగన్వాడీ కేంద్రాలు, కేజీబీవీ పాఠశాల తనిఖీ

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, జనవరి 06:
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం కలెక్టర్ గంభీరావుపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ దశలో ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల నూతన భవనం పనులు త్వరితగతిన పూర్తయ్యేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో విస్తరిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వైద్యాధికారులతో సమీక్షించి వ్యాక్సినేషన్, ప్రసవాలు, టీబీ, ఇతర కేసుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆదేశానుసారం 15 నుండి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి వ్యాక్సినేషన్ చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంతో పాటు, గోరంటాల, ఆర్&ఆర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పిల్లలకు నాణ్యమైన పౌష్ఠికాహారం సక్రమంగా అందించాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ కరుణ, ఎంపీడీఓ శ్రీనివాస్, వైద్యాధికారులు, తదితరులు ఉన్నారు.

Share This Post