గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

ఎల్ బి నగర్ టిమ్స్ ఏర్పాటు కు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.
మంగళవారం గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి ,వేముల ప్రశాంత్ రెడ్డి ,ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు.ఎమ్మెల్సీలు దయనంద్ గారు,ఎగ్గే మల్లేశం ,జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్,ఆయా శాఖల అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. మంత్రులు ఈ సందర్భంగా మార్కెట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 28 ఎకరాల స్థలంలో సూపర్ స్పెషాలిటీ సేవలతో నిర్మించనున్న టీమ్స్ ఆస్పత్రికి సంభందించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారని మంత్రులు పేర్కొన్నారు.15 రోజుల్లో ఇక్కడ నుండి మార్కెట్ ను పూర్తి స్థాయి లో కోహెడ కు తరలించాలని మంత్రులు ఆదేశించారు. మార్కెట్ ను కూడా అత్యాధునిక వసతులతో కోహెడ లో నిర్మించనున్ననట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నగరానికి నలువైపులా నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించటానికి నిర్ణయించినట్లు తెలిపారు. నగర ప్రజల తో పాటు శివారు ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడేలా వీటిని నిర్మించనున్నట్లు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు,ప్రశాంత్ రెడ్డి గార్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ప్రముఖ పెద్ద ఆస్పత్రులు నగర నడి బొడ్డున ఉండగా,కరోనా సందర్భంగా గచ్చిబౌలి లో టీమ్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Share This Post