గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ డి హరిచందన ఆవిష్కరించారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరాడంబరంగా వేడుకలు నిర్వహించారు. 9.45 నిమిషాలకు జిల్లా ఎస్పీ యన్. వెంకటేశ్వర్లు వేడుకల ప్రాంగణానికి చేరుకోగా 9.56 నిమిషలకు కలెక్టర్ చేరుకున్నారు. జిల్లా ఎస్పీ యన్. వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
ప్రభుత్వ అదనపు యస్పి భరత్, ఇంచాజ్ అర్దిఒ నర్సింగ్ రావు, ఖలీద్, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, పాత్రికేయులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.