గణతంత్ర దినోత్సవం సందర్బంగా నూతన కలెక్టరేట్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు

@ ఈ నెల 26 న నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
@ గణతంత్ర దినోత్సవం సందర్బంగా నూతన కలెక్టరేట్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు.

ఈ నెల 26 న 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పాలకొండ సమీపంలోని నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు రెవిన్యూ అదనపు కలెక్టర్ కె .సీతారామారావు ఒక ప్రకటనలో తెలిపారు.

26 న ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు నూతన కలెక్టరేట్ కార్యాలయ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అలాగే వందన స్వీకార కార్యక్రమం, సాంప్రదాయ పోలీస్ కవాతు వుంటాయని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సందేశం ఉంటుందని,అనంతరం స్వతంత్ర సమరయోధులకు సన్మానం, విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ,విశేష సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాల పంపిణీ ఉంటాయని వెల్లడించారు.ఆయా శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Share This Post