గణతంత్ర దినోత్సవ ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం లో మాట్లాడుతున్నఅదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా)

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

00000

జనవరి 26 న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు జిల్లా కెంద్రం లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించుటకు, గ్రౌండ్ ను, డయాస్ ను పోలిస్, రెవెన్యూ అధికారులు చక్కని అలంకరణతో సిద్దం చేయాలని అన్నారు. వేడుకల సందర్బంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజలకు సీటింగ్ అరెంజ్ మెంట్లు చేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారిని, అర్బన్ తహశిల్దార్ ను ఆదేశించారు. వేడుకల సందర్బంగా పోలిస్ పరేడ్ గ్రౌండ్ కు వచ్చు ప్రజలకు, విద్యార్థిణి,విద్యార్థులకు త్రాగు నీటికి వాటర్ బాటల్స్ సమకూర్చాలని, మున్సిపాల్ అధికారులను ఆదేశించారు. కరోనా దృష్యా పోలిస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని, చేతులను శానిటైజ్ చేసుకొనుటకు శానిటైజర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా మాస్కులను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆయన ఆదేశించారు. మైక్ ఏర్పాట్లను ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ ను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించుటకు వీలుగా, వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రసంశ పత్రాలను ప్రధానం చేయుటకు ఇంతవరకు ప్రశంస పత్రములు పొందని ఉత్తమ సేవలందించిన అర్హూలైన ఉద్యోగులను ఎంపిక చేసి జనవరి 20 లోగా ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య, డిఆర్డీఓ శ్రీలత, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, జిల్లా పంచాయతి అధికారి వీర బుచ్చయ్య, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నతానియల్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ రాజు, జిల్లా మార్కెంటింగ్ అధికారి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ నోట్ 2

కోర్టు కేసులకు వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి:

జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టు కేసులు, హ్యూమన్ రైట్ కమిషన్స్, లోకా యుక్త కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులను అధికారులు విధిగా అమలుపర్చాలని ఆదేశించారు. కోర్టు కేసులకు సంబంధించి అన్ని కార్యాలయాల్లో ప్రత్యేక రిజిష్టర్ నిర్వహించాలని సూచించారు. కోర్టు కేసులకు సంబంధించి కలెక్టరేట్ లో ప్రత్యేక లీగల్ సెల్ ను ఏర్పాటు చేశామని, ఏమైనా సందేహాలుంటే లీగల్ సెల్ ను సంప్రదించాలని అన్నారు. కోర్టు కేసులకు సంబంధించిన కౌంటర్ ఫైల్ దాఖలు చేయుటలో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ముఖ్యంగా కాంటెంప్ట్ కేసులపై ప్రత్యేక శ్రద్దతో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Share This Post