గణతంత్ర దినోత్సవ నిర్వహణ పైసమీక్షా సమావేశం గణతంత్ర దినోత్సవం కోసం ఘనంగా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్.సిహెచ్ శివలింగయ్య

ప్రెస్ రిలీజ్

జనగాం జిల్లా,   జనవరి 20

గణతంత్ర దినోత్సవ నిర్వహణ పైసమీక్షా సమావేశం  గణతంత్ర దినోత్సవం కోసం ఘనంగా ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్.సిహెచ్ శివలింగయ్య

జనవరి 26, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై  శుక్రవారం నాడు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ధర్మకంచలోని స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఉత్సవాలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు, ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై ట్యాబ్లోస్ నిర్వహించాలని సాంస్కృతిక కార్యక్రమాలు డిపార్ట్మెంట్ల స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఉత్తమ ఉద్యోగుల గుర్తించి అవార్డుల కోసం ప్రతిపాదనలు పంపాలని జనగామ జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచేలా పకడ్బందీగా గణతంత్ర ఉత్సవాలు నిర్వహణకు అందరూ కలిసి పనిచేయాలని అధికారులను ఆదేశించారు

ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, కృష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామిరెడ్డి, సిపిఓ ఇస్మాయిల్ డిపిఓ వసంత, డిఎ ఓ వినోద్ కుమార్, ఎంపీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, అన్ని శాఖల జిల్లా అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post