*గణతంత్ర దినోత్సవ వేడుకలు,జిల్లా కలెక్టర్ సందేశం*

74వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్ధినీ విద్యార్ధులకు                        నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ రోజు మనందరికి పండుగ రోజు.  ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి సారధ్యంలో భారత రాజ్యాంగం 1950, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నాం.  భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు, భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా              నా జోహార్లు అర్పిస్తున్నాను.
అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న విషయము మనందరికీ తెలుసు.  పొరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు అయిన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి సారథ్యంలో ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.  జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్లుప్తంగా తెలియజేస్తున్నాను.
వ్యవసాయ శాఖ:
 జిల్లాలో రైతు బందు పథకం క్రింద యాసంగి 2022 సీజన్లో 4 లక్షల 79 వేల  387 మంది రైతులకు ఎకరానికి 5 వేల చొప్పున 595 కోట్ల 93 లక్షల రూపాయలు పంటపెట్టుబడిగా పంపిణీ చేయడానికి నిర్దేశించనైనది. ఇందుకు గాను ఇప్పటివరకు               4 లక్షల 60 వేల 838 మంది రైతుల ఖాతాలలో 504 కోట్ల 30 లక్షల రూపాయలు పంటపెట్టుబడిగా పంపిణీ చేయనైనది.
రైతు భీమా పథకం ద్వారా 2022-23 సంవత్సరానికి గాను ఇప్పటి వరకు               455 మంది రైతులు మరణించగా అందులో 409 మంది చనిపోయిన రైతులకు సంబంధించిన వారి వారసుల ఖాతాలలో 20 కోట్ల 45 లక్షల రూపాయలు జీవిత భీమా సంస్థ ద్వారా జమచేయడం జరిగింది. జిల్లాలో 140 రైతువేదికలను 31 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది.  యాసంగి 2022 సీజన్ కు సంబంధించి 60 వేల              777 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నవి.
వానాకాలం 2022-23 పంట కాలంలో 287 ధాన్య సేకరణ కేంద్రముల ద్వారా క్వింటా ఒక్కంటికి 2060 రూపాయలతో 4 లక్షల 12 వేల 790 మెట్రిక్ టన్నుల ధాన్యము కొనుగోలు చేయడం జరిగింది ధాన్యమును 68 వేల 367 మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 838 కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో                జమ చేయడం జరిగింది.
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ:
జిల్లాలో 56 కోట్ల రూపాయల ఖర్చుతో 92 వేల 500 మెట్రిక్ టన్నుల                       నిల్వ సామర్ధ్యం గల 27 గోదాముల నిర్మాణం చేపట్టడం జరిగినది.
ఉద్యాన & పట్టు పరిశ్రమ:
జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరమునకు “జాతీయ ఆయిల్ పామ్ మిషన్” ద్వారా ఆయిల్ పామ్ సాగుకు పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ మరియు సూక్ష్మ నీటి పారుదల పథకం సహకార సమన్వయంతో రాయితీ కల్పిస్తూ జిల్లాలో 3 వేల 500 ఎకరాలలో ఆయి ఫామ్ మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 2023 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం జరిగినది.  389 లబ్దిదారులకు              ఒక కోటి 59 లక్షల రూపాయలు మరియు నర్సరీ యాజమాన్యముకై 20 లక్షల రూపాయలు ఖర్చు చేయబడినవి.
తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటి పారుదల పథకం ద్వారా 611 మంది రైతులకు               3వేల 46 ఏకరములలో ఆయిల్ పామ్ మరియు ఆన్ లైన్ పంటలకు డ్రిప్ పరికరాల సరఫరాకు  మరియు పండ్లు, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటలు పండించే రైతులకు ఎస్.సి./ఎస్.టి.లకు 100%, బి.సి/సన్న/చిన్నకారులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ మంజూరు చేయడమైనది.
సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా కొత్త పండ్ల తోటల, పాత తోటల పునరుద్ధరన, మల్చింగ్, నీటి కుంటల నిర్మాణం, ఉద్యాన యాంత్రీకరణ పరికరాలు,             రైతు శిక్షణలు, మరియు ప్యాక్ హౌస్ నిర్మాణం మొదలైన కార్యక్రమాలకు 69 లక్షల             68 వేల రూపాయలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 7 లక్షల 41 వేల 659 రూపాయలు 151 మంది లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలలో జమచేయనైనది.
సాగునీటి పారుదల శాఖ:
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా గత వర్షాకాలంలో జిల్లా పరిధిలో ఒక లక్షా 45 వేల 330 ఎకరాలకు నీరు అందించడం జరిగింది అలాగే AMRSLBC ప్రాజెక్ట్ హైలెవెల్ మరియు లో లెవెల్ కెనాల్ ద్వారా 2 లక్షల 46 వేల ఎకరాలకు నీరు అందించడం జరిగింది.  అలాగే ఆసిఫ్ నహర్ ప్రాజెక్ట్ ద్వారా 15 వేల 245 ఎకరాలు మరియు డిండి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 12 వేల 975 ఎకరాలకు నీరు అందించడం జరిగింది మరియు మిషన్ కాకతీయలో మైనర్ ఇరిగేషన్ చెరువుల క్రింద    24 వేల 525 ఎకరాలకు నీరు అందించడం జరిగింది.
అలాగే యాసంగిలో కూడా ఒక లక్షా 45 వేల 727 ఎకరాలకు, అలాగే AMRSLBC ప్రాజెక్ట్ హైలెవెల్ మరియు లో లెవెల్ కెనాల్ ద్వారా 2 లక్షల 55 వేల 646 ఎకరాలకు, అలాగే ఆసిఫ్ నహర్ ప్రాజెక్ట్ ద్వారా 15 వేల 245 ఎకరాలు మరియు డిండి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 12 వేల 975 ఎకరాలకు నీరు అందించడం జరుగుచున్నది.
శ్రీశైలం ఎడమ గట్టు సొరంగ పథకం ద్వారా శ్రీశైలం జలాశయం నుండి నేరుగా SLBC కాలువకు, ఎత్తిపోతల పథకం ద్వారా కాకుండా నీటిని తీసుకొనుటకు సొరంగం పనులు పురోగతిలో ఉన్నవి.  మొత్తం 43.930 కీ.మీ.లకు గాను 33.919 కి.మీ.ల సొరంగం పూర్తి అయినది.  ఇందుకు గాను ఈ డిసెంబర్, 2022 వరకు 2,355.90              కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినది.
ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ద్వారా ఒక లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరు అందించుటకు పనులు జరుగుచున్నవి.  డిసెంబర్, 2022 వరకు 431.93 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
డిండి ఎత్తిపోతల పథకం క్రింద మొత్తం ఆయకట్టు 3.61 లక్షల ఎకరాలు.  ఈ పథకం క్రింద ప్రధాన కాలువ యొక్క పొడవు 66.300 కి.మీ. గాను 23.4 కి.మీ.లు పూర్తి అయినది.  ఈ పథకం క్రింద పోతిరెడ్డి పల్లి, ఎర్రవల్లి గోకవరం, ఇర్విన్, కిషరాంపల్లి, శివన్నగూడెం ఆన్ లైన్ రిజర్వాయర్ల పనులు పురోగతిలో కలవు.  అలాగే ఆఫ్ లైన్ రిజర్వాయర్లైన సింగరాజుపల్లి, గొట్టిముక్కల పనులు పూర్తికాగా, డిండి, చింతపల్లి రిజర్వాయర్ల పనులు పురోగతిలో కలవు.  డిసెంబర్, 2022 వరకు ఈ పథకం క్రింద 2,444.94 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
పశుసంవర్ధక శాఖ:
గొర్రెల పంపిణీ పథకం క్రింద జిల్లాలో ఇప్పటి వరకు 28 వేల 234 యూనిట్లను లబ్దిదారులకు పంపిణీ చేయుటకు 356 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.  రెండవ విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు జరుగుచున్నవి.  జిల్లాలో 36 వేల                       500 యూనిట్ల లబ్దిదారులకు అందజేయటానికి ఆదేశాలు రావడం జరిగింది.  అలాగే  పాడి పశువుల పంపిణీ పథకం క్రింద 28 కోట్ల 94 లక్షల రూపాయల ఖర్చుతో 3 వేల 618 పాడి పశువులను పంపిణీ చేయడం జరిగింది.
మత్స్య శాఖ:
2022-23 సంవత్సరమునకు గాను మత్స్యకారులకు 100 శాతం రాయితీపై 1005 చెరువులలో 5 కోట్ల 61 లక్షల 51 వేల చేప పిల్లలను వదలటం జరిగింది               2022-23 సంవత్సరమునకు 100 శాతం రాయితీపై 9 రిజర్వాయర్లలో 45 లక్షల                59 వేల రొయ్య పిల్లలను వదిలి వారి జీవనోపాధిని పెంపొందిచుటకు ప్రోత్సాహము కల్పించబడినది.  ప్రధాన మంత్రి మత్స్య సంపద సమృద్ధి యోజన పథకం  క్రింద                   14 మంది లబ్దిదారులు 19.65 హెక్టార్లలో కొత్త చేపల చెరువు నిర్మాణం మరియు 2 చేప విత్తనాల  హాచరీస్ నిర్మాణములను పూర్తి చేయడం జరిగింది.  అదే విధంగా ఒక బయో ఫ్లాక్ యూనిట్, ఒక చేప విత్తనాల హాచరీస్, 12 మంది కొత్త చేపల చెరువు నిర్మాణం లబ్దిదారులకు 41 లక్షల 60 వేల రూయపాయల సబ్సిడీ విడుదల చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలోని సభ్యులకు నేటివరకు                       7 కుటుంబాలకు 5 లక్షల చొప్పున గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మంజూరు చేయడం జరిగింది.
గృహనిర్మాణం:
గృహనిర్మాణ పథకములో భాగంగా జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గమునకు  14 వందల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 8 వేల 155 రెండు పడకల గదుల గృహాలను నిర్మించుటకు గాను 375 కోట్ల రూపాయలు కేటాయించనైనది. ఇప్పటివరకు 2 వేల    981 రెండు పడక గదుల గృహాలు పూర్తి చేసి 210 గృహములను లబ్దిదారులకు అందజేయనైనది. 537 గృహాల నిర్మాణం పురోగతిలో నున్నవి.
మిషన్ భగీరథ:
మిషన్ భగీరథ కార్యక్రమం క్రింద ప్రతి గ్రామంలో ఇంటింటికీ 100 LPCD మరియు పురపాలక/నగరపంచాయితీ నందు 135 LPCD చొప్పున రక్షిత మంచినీరు సరఫరా చేయబడుచున్నది.  జిల్లాలో 2 వేల 345 కోట్ల రూపాయలు బల్క్, 596 కోట్ల 33 లక్షలు ఇంట్రా నెట్ వర్క్ క్రింద మొత్తం 2 వేల 941 కోట్ల 33 లక్షల రూపాయలు ఖర్చు చేసి 1718 ఆవాసాలకు 4 లక్షల 2 వేల 248 గృహాలకు నల్లా కనెక్షన్లు బిగించి ఇంటింటికి సురక్షిత త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది
విద్యుత్:
1 జనవరి 2018 నుండి  వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ పథకము ద్వారా జిల్లాలో 2 లక్షల 21 వేల 879 మంది వ్యవసాయ వినియోగదారులు లబ్ది పొందుతున్నారు.
2021-22 ఆర్ధిక సంవత్సరంలో 12 వేల 817, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు 6 వేల 476 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. 16 కోట్ల 50 లక్షల రూపాయలతో 7 విద్యుత్ ఉప కేంద్రములు మంజూరు చేయగా పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి.
పల్లె ప్రగతి పథకం ద్వారా 33 కోట్ల 45 లక్షల రూపాయలతో జిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్న విద్యుత్ సమస్యలను తీర్చడం జరిగింది అదేవిధంగా వివిద మున్సిపాలిటీలలో సుమారు 8 కోట్ల 46 లక్షల రూపాయలతో వివిధ పనులు పూర్తి చేయడం జరిగింది.  ఎస్సీ హ్యాబిటేషన్ పథకం ద్వారా జిల్లాలోని 346 గ్రామాలకు 10 కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేసి విద్యుద్దీకరణ చేయడం జరిగింది.
గిరి వికాసం పథకం ద్వారా 171 బోరు బావులకు గాను 167 బోరు బావులను       ఒక కోటి 92 లక్షల రూపాయలతో విద్యుద్దీకరణ చేయడం జరిగింది.
జిల్లాలో అర్హులైన 995 నాయిబ్రాహ్మణ మరియు 5131 రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరుగుతుంది.
పరిశ్రమలు- టి.ఎస్.ఐ.పాస్.
టి.ఎస్.ఐ-పాస్. చట్టం క్రింద జిల్లాలో 2022-23 ఆర్ధిక సంవత్సరంలో వివిధ శాఖల నుండి 85 పరిశ్రమలకు గాను 147 అనుమతులు ఇప్పించడం జరిగింది.  వీటి ద్వారా 413 కోట్ల 71 లక్షల రూపాయల పెట్టుబడి లభించి 1447 మందికి ఉపాధి కల్పించబడుచున్నది.  టి.ఫ్రైడ్ పథకం క్రింద 2022-23 సంవత్సరములో ఇప్పటి వరకు 619 పరిశ్రమల/సర్వీసు యూనిట్ల దరఖాస్తులకు గాను 8 కోట్ల 67 లక్షల రూపాయలు పెట్టుబడి రాయితీగా మంజూరి చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 110 ప్రాజెక్టులకు 3 కోట్ల 51 లక్షల రూపాయలు రాయితీతో మంజూరు చేయనైనది.
చేనేత మరియు జౌళి శాఖ:
చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు తెలంగాణ చేనేత త్రిప్ట్ పొదుపు మరియు భద్రత పథకం (నేతన్నకు చేయూత పథకం) ను ప్రారంభించుట జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం తరపున RD-2 ఖాతాలో నగదును 4 వేల 368 మంది చేనేత కార్మికులకు 8 కోట్ల 87 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది.
చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ పథకం క్రింద 551 మంది చేనేత కార్మికులకు  ఒక కోటి 90 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.  చేనేత మిత్ర పథకం ద్వారా 3 వేల 811 మంది చేనేత కార్మికులకు 2 కోట్ల 13 లక్షల రూపాయల సబ్సిడీ వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది.
తెలంగాణ మరమగ్గ త్రిప్ట్ పొదుపు మరియు భద్రత పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారి మ్యాచింగ్ వాటా క్రింద 2 వేల 826 మంది మరమగ్గ కార్మికులకు 118.28 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
నేతన్న భీమా పథకం క్రింద 5 వేల 678 మంది చేనేత మరియు మరమగ్గ కార్మికులు నమోదు చేయడం జరిగింది. ఈ పథకంలో ఇప్పటి వరకు 7 మంది మరణించగా వారి నామినీ ఖాతాలో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ:
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఈ ఆర్ధిక సంవత్సరంలో 89 కోట్ల 73 లక్షల రూపాయలు ఖర్చు చేసి 2 లక్షల 68 వేల మంది కూలీలకు ఉపాధి కల్పించడం జరిగినది.  జిల్లాలో ప్రతి గ్రామ పంచాయితీ మరియు ప్రతి ఆవాసంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించనైనది.  ఇప్పటి వరకు 94 క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయబడి మరో 238 నిర్మాణ దశలో ఉన్నవి.
స్త్రీ నిధి పథకం క్రింద 2022-23 సంవత్సరంలో 31 మండలాలలోని 661 గ్రామ సమాఖ్యల ద్వారా 4088 స్వయం సహాయక సంఘాలలోని 11 వేల 51 సభ్యులకు                87 కోట్ల 97 లక్షల రూపాయల ఋణ సౌకర్యం కల్పించనైనది.
2022-23 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంక్ లింకేజీ ద్వారా 11 వేల 581 స్వయం సహాయక మహిళా సంఘాలకు 709 కోట్ల 84 లక్షల 83 వేల రూపాయల ఋణం మంజూరు చేయడం జరిగింది.
జిల్లాలో ప్రతి మండలానికి 5 చొప్పున బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 12 లక్షల 15 వేల మొక్కలు నాటడం జరిగింది. జిల్లాలో 1426 గ్రామాలు మరియు ఆవాసాలలో 1437 పల్లె ప్రకృతి వనములు ఏర్పాటు చేసి 19 లక్షల 57 వేల మొక్కలు నాటడం జరిగింది.
ఆసరా ఫించన్ల మంజూరుకు కనీస అర్హత వయస్సును 65 సంవత్సరముల నుండి 57 సంవత్సరములకు తగ్గించడం జరిగింది. ఈ పథకంలో వృద్దాప్య, వితంతు, కల్లుగీత, బీడీ మరియు చేనేత కార్మికులకు నెలకు 2016/- రూపాయల చొప్పున మరియు వికలాంగులకు 3016/- చొప్పున జిల్లాలో మొత్తం 2 లక్షల 14 వేల 256 మంది లబ్దిదారులకు 50 కోట్ల 69 లక్షల 29 వేల రూపాయలు పించన్లు ప్రతినెల పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలలైన 7 వేల 784 మందికి నెలకు 2016/- చొప్పున జీవన భృతి మంజూరు చేయడం జరుగుచున్నది.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 811 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా 69 కోట్ల 58 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది స్వయం ఉపాధి పథకం ద్వారా స్వయం సహాయక సభ్యురాళ్లకు నిరుద్యోగ యువతకు జీవనోపాధులు మెరుగుపరుచుటకు                 76 మంది సభ్యులకు 96 లక్షల 02 వేల రూపాయలు మంజూరు చేయనైనది.  ప్రధానమంత్రి ఆహార ఉత్పత్తి మరియు ఆర్ధిక చేయుత పథకం ద్వారా నల్లగొండ పట్టణ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 37 మంది సభ్యులకు 14 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా జిల్లాలో ఒక లక్షా 15 వేల 673 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయబడి పూర్తి చేయబడినవి. ఇప్పటి వరకు 844 గ్రామాలు ఆరు బయట మల విసర్జన రహిత గ్రామాలుగా (ODF) ప్రకటించనైనది.
అటవీ శాఖ:
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2022-23 సంవత్సరంలో జిల్లాలో 70 లక్షల మొక్కలు నాటి 100 లక్ష్యం పూర్తి చేయడం జరిగింది.
ఆహార భద్రత కార్డులు మరియు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం:
రూపాయికి కిలో బియ్యం పథకము ద్వారా 991 చౌక ధరల దుకాణాల ద్వారా జనవరి – 2015 మాసము నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూపాయికి కిలో బియ్యం పథకం ద్వారా ప్రతి కుటుంబసభ్యునికి 5 కేజీల చొప్పున కుటుంబంలోని అందరూ సభ్యులకు అందించడం జరుగుతుంది జిల్లాలో ఉన్న 4 లక్షల 66 వేల 939 కుటుంబములకు ఆహార భద్రత పథకం క్రింద ప్రతి మాసమునకు 4 వేల 470 మెట్రిక్ టన్నుల సబ్సిడీ బియ్యం లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుచున్నది.
కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్:
2022-23 సంవత్సరంలో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకంల క్రింద SC/ST/BC/EBC & మైనారిటీలకు ఒక్కొక్కరికి ఒక లక్షా 116 రూపాయల చొప్పున  6 వేల 755 మంది లబ్దిదారులకు 67 కోట్ల 62 లక్షల 83 వేల 580 రూపాయలు  చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది.
జాతీయ కుటుంబ భీమా పథకం:
 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 29 మంది లబ్దిదారులకు 5 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు:
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి దామరచర్ల మండలం వీర్లపాలెం ఫారెస్ట్ బ్లాక్ లో 30 వేల కోట్లతో, 5 వేల 600 ఎకరాలలో 4 వేల మెగా వాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రత్యక్షంగా 8 వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి లబిస్తుంది.
రోడ్లు మరియు భవనాలు:
జిల్లాలో రెండు వరుసల రహదారి సౌకర్యము లేనటువంటి మండలాలను                   జిల్లా కేంద్రంతో అనుసంధానం చేయుటకు మరియు ఇతర ప్రధాన రహదారులను రెండు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయడానికై 339 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 293.40 కిలోమీటర్ల రహదారి పనులకు గాను 292.40 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి అయినవి. CRF-2019 నిధులతో 52.40 కిలో మీటర్ల రహదారి వెడల్పు చేయుటకు 59 కోట్లతో మంజూరు చేయడం జరిగినది. ఇందులో భాగంగా 52.40 కిలోమీటర్ల రహాదారులను వెడల్పు చేయడం జరిగింది.              108 కోట్ల రూపాయల నాన్ ప్లాన్ నిధులతో 311 కిలోమీటర్లకు పీరియాడికల్ రెనెవెల్స్ పనులు మంజూరు చేయడం జరిగింది. 11 కోట్ల రూపాయల ఎఫ్.డి.ఆర్. నిధులతో                6 బలహీనమైన  వంతెనల నిర్మాణం మరియు 50 కిలోమీటర్ల రహదారి పనులు మంజూరు చేయడం చేయడం జరిగింది.
పంచాయితీరాజ్ ఇంజనీరింగ్:
పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 2017-18 మరియు 2021-22 సంవత్సరాలకు గాను వివిధ పథకాలగు PMGSY, MGNREGS, CRR, SDF, SC Community Halls, CBF, DMFT, MPLADs, Rythuvedika Sheds, Crematoria, ZPGF మరియు ఇతర గ్రాంటుల నుండి గ్రామీణ రహదారుల నిర్మాణము, బ్రిడ్జి పనులు, భవనాల నిర్మాణము, రోడ్ల మరమ్మత్తులు ఇతర పనులకు గాను జిల్లాకు 773 కోట్ల                89 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 7 వేల 952 పనులు మంజూరు అయినాయి.  ఇప్పటి వరకు 5 వేల 947 పనులు పూర్తి అయినవి.  మిగిలిన పనులు పురోగతిలో కలవు.
జిల్లా పరిషత్:
జిల్లాలో 15వ ఆర్ధిక సంఘము నిధులు జిల్లా పరిషత్ కు 2022-23 సంవత్సరమునకు గాను 5 కోట్ల 26 లక్షల నిధులు విడుదలైనవి. జిల్లాలోని                       31 మండలాలలో వివిధ గ్రామాలలో ప్రాథమిక పశు వైద్య కేంద్రాలు, పశు వైద్య ఉపకేంద్రాలలో మరుగుదొడ్లు,  త్రాగునీటి సౌకర్యం, మురికి కాలువల నిర్మాణం కొరకు                3 కోట్ల 71 లక్షల నిధులు విడుదల చేయనైనది.  పనులు పురోగతిలో ఉన్నవి.
గ్రామ పంచాయితీలు:
2021-22 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలోని (844) గ్రామ పంచాయితీలకు గాను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వముల నుండి 166.75 కోట్లు మరియు 2022-23 సంవత్సరములో 86 కోట్ల 3 లక్షల రూపాయలు విడుదల కాబడినవి.  గ్రామ పంచాయితీ పరిధిలోని నివాస ప్రాంతాల నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించుటకు మరియు తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పోయుటకు గాను ప్రతి గ్రామ పంచాయితీకి నూతన ట్రాక్టర్లు, ట్రాలీలు మరియు ట్యాంకర్లు కొనుగోలు చేయడం జరిగింది.  హరితహారంలో భాగంగా ప్రతి గామంలో కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా పల్లె ప్రకృతి వనాలను గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద తీర్చదిద్దనైనది. మరియు పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో ఒక వైకుంఠ ధామం ను ఏర్పాటుచేయనైనది. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ప్రతి గామ పంచాయితీ పరిధిలో ఒక తెలంగాణ క్రీడా ప్రాంగణం ను ఏర్పాటు చేయడం జరుగుచున్నది.
పురపాలక సంఘాలు:
నల్లగొండ పట్టణంలో రహదారులకు, జంక్షన్ల అభివృద్ధి మరియు ఆర్చ్ లకు, వల్లభరావు చెరువు సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్లు, రైతు బజార్, వైకుంఠధామాలు, వైకుంఠ రధాలు, భూగర్భ మురికి కాలువలకు, వరద నీటి కాలువలకు, ఉదయ సముద్రం అభివృద్ధి మరియు సుందరీకరణ మరియు కళాభారతి నిర్మాణం కొరకు 702 కోట్ల 76 లక్షలు మంజూరు చేయబడి పనులు పురోగతిలో కలవు.
మిర్యాలగూడ మున్సిపాలిటీని కేంద్ర ప్రభుత్వం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత పట్టణంగా గుర్తించనైనది.  పట్టణమునందు వివిధ ప్రదేశాలలో 10 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం జరుగుతుంది.  SCSP గ్రాంట్స్, 14వ ఆర్ధిక సంఘం నిధులతో దాదాపు 8 కోట్ల 14 లక్షల రూపాయల విలువైన 160 పనులు ప్రగతిలో ఉన్నాయి.  పట్టణ ప్రగతి నిధులు 2 కోట్ల 45 లక్షలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నవి. TUFIDC గ్రాంటు ద్వారా 100 కోట్లు మంజూరై పనులు పురోగతిలో కలవు.
దేవరకొండ పట్టణమునందు పట్టణ ప్రగతి, తెలంగాణకు హరితహారం,  DMFT, TUFIDC, సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్లు, 15వ ఆర్ధిక సంఘం, వైకుంఠ ధామమ్ పథకంల ద్వారా 52 కోట్ల 24 లక్షల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు.
హాలియా మున్సిపాలిటీ నందు పట్టణ ప్రగతి, TUFIDC, SDF, సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్లు, వైకుంఠ ధామమ్ పథకంల ద్వారా 30 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు.
చండూరు మున్సిపాలిటీ నందు  హరితహారం, రహదారుల అభివృద్ధి, తెలంగాణ క్రీడా ప్రాణగనమ్ మరియు SDF పథకంల ద్వారా 14 కోట్ల 65 లక్షల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు.
చిట్యాల మున్సిపాలిటీ నందు TUFIDC, SDF పథకంల ద్వారా, వైకుంఠ ధామమ్, రహదారులు, మురికి కాలువలు, సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్ల కొరకు 28 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు
నందికొండ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిధులు, TUFIDC, SDF పథకంల ద్వారా సమీకృత శాఖాహార మరియు మాంసాహార మార్కెట్లు, రహదారులు, మురికి కాలువలు, క్రీడా ప్రాంగణాల కొరకు 30 కోట్ల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు.
నక్రేకల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి నిధులు, TUFIDC, SDF పథకంల ద్వారా రహదారులు, మురికి కాలువల కొరకు 78 కోట్ల 68 లక్షల రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు.
వైద్య మరియు ఆరోగ్య శాఖ:
జిల్లాలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 19, 2023న ప్రారంభించడం జరిగింది.  జిల్లాలోని 31 మండలాలు, 39 ఆరోగ్య కేంద్రాలలలో,                   844 గ్రామ పంచాయితీలలో, 182 వార్డులలో వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన 74 టీంలు 1026 క్యాంపుల ద్వారా 100 రోజులలో 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయడం జరుగుతుంది.
   తెలంగాణలోని పేద విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించే విధంగా శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయుటలో భాగంగా నల్లగొండ జిల్లా నందు 275 కోట్ల రూపాయలతో వైద్యకళాశాలను కేటాయించడం జరిగింది.  అందులో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం కొరకు 37 ఎకరాల భూమిని SLBC నల్లగొండ నందు కేటాయించి 117 కోట్ల రూపాయలతో కళాశాల నిర్మాణం ను గౌరవ మంత్రివర్యులు శ్రీ టి. హరీష్ రావు, ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణ గారి ఆదేశాల మేరకు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగినది.  ప్రతి సంవత్సరం 150 మంది వైద్య విద్యార్ధులు చేరే విధంగా జాతీయ జాతీయ మెడికల్ కమీషన్ వారి అనుమతితో 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 600 మంది విద్యార్ధులు ప్రవేశాలు చేసి వైద్య విద్యను అభ్యసించడం జరుగుచున్నది.  అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్/DNB వైద్య విద్యలో భాగంగా 2022-23 సంవత్సరానికి గాను                  7 విభాగాలలో మొత్తం 25 మంది విద్యార్ధులు వైద్య విద్యను అభ్యసించటం జరుగుతున్నది.
కెసిఆర్ కిట్ పథకం లో భాగంగా 4 విడతలుగా గర్భిణీలకు 27 కోట్ల 30 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహము ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 53 వేల 101 కిట్లు పంపిణీ చేయడం జరిగింది.  జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం క్రింద గడచిన ఏడాది కాలంలో               27 వేల 912 మందికి వైద్య చికిత్సలు అందించుటకు గాను 57 కోట్ల 28 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.  తెలంగాణ వైద్య విధాన పరిషత్, నల్లగొండ జిల్లా పరిధితో 5 వైద్యశాలలు వైద్య సేవలు అందించుచున్నాయి.  ప్రాంతీయ వైద్యశాల, మిర్యాలగూడ యందు అదనపు 100 పడకల భవన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.  84 లక్షల రూపాయాలతో మరమ్మత్తు పనులు జరుగుచున్నవి.  10 పడకల ఐ.సి.యు, 30 పడకల ప్రత్యేక చిన్న పిల్లల వార్డు ప్రారంభానికి సిద్దం చేయడం జరిగింది.  మార్చురీ ఆధునీకరణ, రోగుల సహాయకుల వసతి షెడ్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నవి.  ఏరియా వైద్యశాల దేవరకొండ భవనమునకు 64 లక్షల రూపాయలతో మరమ్మత్తు పనులు జరుగుచున్నవి,                    10 పడకల ఐ.సి.యు సిద్దంగా ఉన్నది. సామాజిక వైద్యశాల నక్రేకల్ నూతన                      100 పడకల భవన నిర్మాణానికి 6 ఎకరాల భూమి కేటాయించి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుచున్నవి.  ప్రాంతీయ వైద్యశాల నాగార్జున సాగర్ నందు కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం:
జిల్లాలోని 2093 అంగన్ వాడి కేంద్రాల ద్వారా ఆరోగ్య లక్ష్మి పథకం క్రింద 1 లక్షా 14 వేల 347 మంది గర్బిణీ, బాలింత స్త్రీలు మరియు శిశువులు సేవలు పొందుతున్నారు.   ఇప్పటి వరకు గృహ హింస చట్టము ప్రకారము 29 మంది బాధిత మహిళలకు కోర్టు ద్వారా తుది ఉత్తర్వులు ఇప్పించడమైనది. సమగ్ర బాలల పరిరక్షణ పథకం ద్వారా ఆదరణ మరియు సంరక్షణ అవసరమైన 1372 మంది బాలలకు రక్షణ మరియు వసతి కల్పించబడింది.  చట్టబద్దమైన దత్తత కోసం జిల్లాలో శిశు గృహాలు ప్రస్తుతం నల్లగొండలోనే ఉన్నవి.  ఇప్పటి వరకు 324 మంది పిల్లలను అర్హులైన తల్లిదండ్రులకు దత్తతకు ఇవ్వడం జరిగింది.
2021-22 సంవత్సరంలో దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమం కొరకు 77 లక్షల 48 వేల రూపాయల విలువ గల 19 ల్యాప్ టాప్స్, 4జి మొబైల్స్ 18, వీల్ ఛైర్లు 50,  హియరింగ్ Aids 20, అంధుల చేతి కర్రలు 15, మోటోరైజ్డ్ వెహికిల్స్ 55, బ్యాటరీ వీల్ ఛైర్లు 34 మంజూరు చేయనైనది.  వయోవృద్ధుల కొరకు 14567 టోల్ ఫ్రీ నెంబరును వినియోగములోకి తెచ్చి సేవలు అందించడం జరుగుచున్నది.
షెడ్యూల్డు కులముల అభివృద్ధి శాఖ:
ఈ విద్యా సంవత్సరంలో 61 వసతి గృహములలో 4 వేల 360 మంది విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రవేశం కల్పించనైనది మరియు వాటి నిర్వహణకు 7 కోట్ల 33 లక్షల రూపాయలు ఖర్చు చేయనైనది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపకార వేతనముల క్రింద                     8 వేల 976 మంది విద్యార్ధులకు 13 కోట్ల 93 లక్షల రూపాయలు మంజూరు చేయనైనది.  అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం క్రింద 15 మంది విద్యార్ధులకు ఒక కోటి 95 వేల రూపాయలు మంజూరీ చేయడం జరిగింది. షెడ్యూల్డు కులముల కుటుంబాలకు 0-101 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం క్రింద ఒక లక్షా 41 వేల 376 మంది లబ్దిదారులకు ఒక కోటి 51 లక్షల రూపాయలు మంజూరు చేయనైనది.
దళిత బందు:
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో దళితుల్లో ఆర్ధిక సాధికారత సాధించడం కోసం దళిత బందు పథకం ను ప్రవేశపెట్టినది. ఒక్కొక్క లబ్దిదారుని కుటుంబానికి                  10 లక్షల రూపాయల చొప్పున పూర్తి రాయితీతో కూడిన స్వయం ఉపాధి పథకములు ఏర్పాటు చేసుకొనుటకు  ఇవ్వడం జరుగుచున్నది జిల్లాలో 517 లబ్దిదారుల కుటుంబాలకు 51 కోట్ల 17 లక్షల రూపాయలు ఆర్ధిక లక్ష్యముగా జిల్లాకు కేటాయించనైనది.  ఇప్పటి వరకు అన్ని నియోజకవర్గాల పరిధిలో లబ్దిదారులకు మంజూరీ ఉత్తర్వులు జారీ చేసి గ్రౌండింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుచున్నది, ఇప్పటి వరకు 47 కోట్ల 29 లక్షల రూపాయలు ఖర్చు చేసి లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేయడం జరిగింది
షెడ్యూల్డు కులముల వార్షిక ప్రణాళిక 2020-21 క్రింద ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యేక సాధికారత కార్యక్రమం క్రింద నక్రేకల్ నియోజకవర్గం మరియు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శాలిగౌరారం మండలంలో 210 మంది లబ్దిదారులకు ఒక్కొకరికి ఒక లక్షా 40 వేల రూపాయల సబ్సిడీ చొప్పున రెండు పాడి గేదెల సరఫరా చేయుటకు గాను జిల్లాకు 2 కోట్ల 94 లక్షల రూపాయల రాయితీ లక్ష్యములతో లబ్దిదారుల ఎంపిక మరియు మంజూరీ ఉత్తర్వులు జారీ చేసి గ్రౌండింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుచున్నది.
భూమి కొనుగోలు పథకం క్రింద నేటి వరకు 14 ఏకరముల అసైన్డ్ భూమిని                 15 కుటుంబాలకు మరియు 578 ఏకరముల ప్రైవేటు భూమిని 219 కుటుంబాలకు భూమి కొనుగోలు చేసి అందజేయనైనది.  అందుకు గాను మొత్తం 24 కోట్ల 56 లక్షల రూపాయలు ఖర్చు చేయనైనది.
గిరిజన అభివృద్ధి శాఖ:
జిల్లాలో 42 గిరిజన వసతి గృహాలు మరియు ఆశ్రమ పాఠశాలల యందు 8 వేల  932 మంది విద్యార్ధినీ విద్యార్ధులు వసతి పొందుతున్నారు. వీరికై ఈ సంవత్సరము                 9 కోట్ల 29 లక్షల రూపాయాలు ఖర్చు చేయడం జరిగినది మరియు 3017 మంది గిరిజన విద్యార్ధినీ విద్యార్ధులకు ఉపకార వేతనములకు 3 కోట్ల 75 లక్షల  రూపాయలు మంజూరు చేయడం జరిగినది.  అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 8 మంది విద్యార్ధులు ఎంపిక కాగా వారికి 80 లక్షల రూపాయలు మొదటి విడత క్రింద మంజూరు చేయడం జరిగినది.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ:
జిల్లాలో 46 వసతి గృహములలో 4576 పాఠశాల, కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు వసతి కల్పించడం జరిగినది.  వీటి నిర్వహణకు 2021-22 సంవత్సరములో ఇప్పటి వరకు 5 కోట్ల 27 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మరియు 2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఉపకార వేతనములు మరియు ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద ఇప్పటి వరకు 40 కోట్ల 54 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది మరియు 2021-22 విద్యాసంవత్సరమునకు పెండింగ్ లో గల 46 వేల 83 మంది విద్యార్ధులకు 31 కోట్ల 51 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
బి.సి. కార్పొరేషన్ నుండి నల్లగొండ పట్టణం మోతికుంట యందు 35 లక్షల వ్యయంతో Modern Mechanized ధోభీఘాట్ యూనిట్ ను నిర్మాణం చేసి మిషన్లు కూడా ఏర్పాటు చేయనైనది.  6 వేల 809 మంది రజక/నాయిబ్రాహ్మణ కమ్యూనిటి వారికి మరియు ప్రతి నెల 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుచున్నది.
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ:
జిల్లాలో 6 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2515 మంది విద్యార్ధినీ విద్యార్ధులు మరియు ఆరు జూనియర్ కళాశాలల్లో 960 మంది విద్యార్ధినీ విద్యార్ధులు చదువుచున్నారు.  మెస్ ఛార్జీలు, బోధనా రుసుముల క్రింద 2091 మంది విద్యార్ధులకు ఒక కోటి 83 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది.  విదేశాలలో పై చదువుల కొరకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఆరుగురు విధ్యార్ధులకు ఒక కోటి                 23 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. రంజాన్ పండుగకు ప్రభుత్వం జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గములకు 10 వేల 500 మంది నిరుపేద ముస్లింలకు దుస్తులను సరఫరా చేసినారు మరియు పంపిణీ చేయనైనది.  క్రిస్మస్ పండుగ సందర్బంగా జిల్లాలోని 6 నియోజకవర్గములకు చెందిన 6 వేల మంది నిరుపేద క్రైస్తవులకు 6000 దుస్తులను పంపిణీ చేయడం జరిగింది.
విద్యా శాఖ:
పాఠశాల విద్యలో మరింత ప్రగతిని సాధించడానికి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం “మన ఊరు- మన బడి”.  ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 517 పాఠశాలలను ఎంపిక చేయనైనది.  జిల్లాలో 175.37 కోట్ల అంచనా విలువతో 1876 పనులను ప్రతిపాదించగా అన్నింటిని సాంకేతికంగా అనుమతించనైనది.  396 పాఠశాలల అకౌంట్లలలో 7 కోట్ల 46 లక్షల రూపాయలను జమ చేయనైనది.
జిల్లాలో 1 నుండి 10వ తరగతుల ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 9 లక్షల               31 వేల 352 ఉచిత జాతీయ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయనైనది.  మధ్యాహ్న భోజన పథకం అమలుకు 13 కోట్ల 24 రూపాయలు విడుదల చేయనైనది.
ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ:
జిల్లాలోని పల్లెలు, తండాల నుండి నాటు సారాయిని సమూలంగా నిర్మూలించి మన జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ మరియు కల్తీకల్లు నిరోధమే ధ్యేయంగా హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యమై ఇప్పటి వరకు 9 లక్షల ఈత మరియు ఖర్జూర మొక్కల పెంపకం చేపట్టడం జరిగినది.  ఇంతే కాకుండా ఇప్పటి వరకు కల్లు గీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుండి పడి గాయపడిన మరియు చనిపోయిన వారి కుటుంబాకు మొత్తం 404 మందికి 4 కోట్ల                16 లక్షల 20 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా పరిహారం రూపంలో ఇవ్వడం జరిగినది మరియు 50 సంవత్సరములు పై బడిన 7098 కార్మికులకు 2016 రూపాయలు ఆసరా పథకం ద్వారా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది.  ఉపాధి కోల్పోయిన గుడుంబా ఆధారిత కుటుంబాలకు పునరావాస పథకం క్రింద ఇప్పటి వరకు 226 కుటుంబాలకు 4 కోట్ల 52 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది.
దేవాదాయ – ధర్మాదాయ శాఖ:
పురాతన ఆలయాల అభివృద్ధి కోసం సర్వ శ్రేయా నిధి నుండి 21 దేవాలయాలకు గాను 9 కోట్ల 04 లక్షల 40 వేల రూపాయల ఖర్చుతో పనులు జరుగుచున్నవి. మరియు బలహీన వర్గాల కాలనీ పథకం ద్వారా 38 దేవాలయాలకు 4 కోట్ల 52 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పనులు పురోగతిలో కలవు.  ఆర్ & ఆర్ సెంటర్ క్రింద 2 దేవాలయాలకు గాను ఒక కోటి రూపాయలు మంజూరై పనులు పురోగతిలో కలవు.
ధూపదీప నైవేద్యం క్రింద జిల్లాలో 182 మంది దేవాలయములలో పనిచేయుచున్న అర్చకులకు ప్రభుత్వం నుండి నెలకు 6 వేల చొప్పున ధూప దీప నైవేధ్యం పథకం నుండి వేతనం పొడుతున్నారు.
శాంతి భద్రతలు:
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ శాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు పరుస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్ళటానికి కృషి చేస్తుంది. జిల్లాలో మహిళల రక్షణకు మూడు షీ టీంలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాము.
జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధికి నిర్మాణాత్మక రీతిలో సహాకారం, సూచనలు అందజేయుచున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరరవ విద్యుత్ శాఖా మాత్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు అందరికీ ఈ సంధర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాన న్యాయమూర్తికి గారికి, శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నల్లగొండ గారికి, వివిధ శాఖల జిల్లా ఉద్యోగులకు, బ్యాంకర్లకు, స్వచ్చంద సంస్థలకు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసి జిల్లా ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

*గణతంత్ర దినోత్సవ వేడుకలు,జిల్లా కలెక్టర్ సందేశం*

Share This Post