గణేష్ ఉత్సవాలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి — జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్ధం

గణేష్ ఉత్సవాలకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలి — జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మహబూబాబాద్, సెప్టెంబర్-04:

వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. అన్ని ఏర్పాట్లు చేసి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని తెలిపారు.

శనివారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో సంబంధిత శాఖాధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. గణేష్ ఉత్సవ కమిటీ వారితో సంప్రదించి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు, విద్యుత్ శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయిలో చేపట్టవలసిన పనుల ఏర్పాట్లను పకడ్భందీగా చేపట్టాలని తెలిపారు. 4 మున్సిపాలిటీలతో పాటు, పట్టణ, పల్లెల్లో నిర్వహించే గణేష్ ఉత్సవాలపై దృష్టి పెట్టాలని, మండపంలో గణేష్ విగ్రహం పెట్టినప్పటి నుండి నిమజ్జనం వరకు ప్రతి రోజు ఎ.ఎన్.ఎం., ఆశా కార్యకర్తలతో, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితో మైకుల ద్వారా కోవిడ్, ఇతర జాగ్రత్తలపై అనౌన్స్మెంట్ చేయించాలని, మండపాల వద్ద ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలని, మాస్క్ లు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని తెలిపారు.

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు మునిసిపాలిటీల వారిగా మున్సిపల పరిధిలో గల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాలు సోమవారం లోగా నిర్వహించుకొని ఏర్పాట్లను పకడ్భందీగా చేసేటట్లు చూడాలని మునిసిపల్ కమీషనర్ లను ఆదేశించారు. గతంలో నిమజ్జనం చేసిన చోటనె ఈ సంవత్సరం నిమజ్జనం చేయుటకు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనం చేయడానికి సమావేశం ఏర్పాటు చేసుకొని సరియైన ప్రదేశంలో ఎవరికి అభ్యంతరమ్ లేని ప్రదేశంలో నిమజ్జనం నిర్వహించే విధంగ చూడాలన్నారు. రోడ్డుపై వెళ్ళే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తిసుకోవాలని తెలిపారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో కలిసి మునిసిపల్ కమీషనర్లు కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంలో దారి మధ్యలో త్రాగునీటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నిమజ్జనానికి వెళ్ళే దారి మధ్యలో వంతెనలు, రోడ్డులు సరి చూసుకోవాలని ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

గణేష్ ఉత్సవాల సందర్భంగా వీధుల్లో వదులుగా వేలాడే వైర్లను సరి చేయాలని, మండపాల్లో తీసుకునే విద్యుత్ కనెక్షన్ల తో అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి జాగ్రత్తలు పాటించాలని, అగ్ని నివారణ యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిమజ్జనం రోజున పార్కింగ్ సమస్య లేకుండా, రూట్ మ్యాప్ తయారు చేసుకొని నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను ఒక దారి నుండి, నిమజ్జనం అనంతరం మరో దారి నుండి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. నిమజ్జనం రోజున అవసరానికి తగ్గట్టుగా క్రేన్ లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ వలన గత సంవత్సరం విగ్రహాలు ఎక్కువగా నమోదు కాలేదని, అంతకు ముందు సంవత్సరాల్లో దాదాపు 2500 వరకు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా అలాగె విగ్రహాలు ఏర్పాటు చేయనున్నందున ట్రాఫిక్ సమస్య లేకుండా, లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, మండపాల్లో యువకులు ఎక్కువగా గుమిగూడి ఉండకుండా సంబంధిత గణేష ఉత్సవ కమిటి వారు చర్యలు తీసుకోవాలని, మండపంలో సామాజిక దూరం పాటించి కోవిడ్ నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. పోలిస్ పరంగా కావలసిన అనుమతులను వెంటనే ఇవ్వనున్నామని తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, మునిసిపల్ అధికారులు రూట్ మ్యాప్ తయారు చేసుకొని లైటింగ్, శానిటేషన్ కార్యక్రమాలు, ఇతర ఏర్పాట్లు నిర్వహించుకునేందుకు ఇంచార్జులను నియమించుకొని ఏర్పాట్లు చేయాలని, వినాయక చవితి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు, నిమజ్జనం అనంతరం చేయవలసిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై ముందస్తుగా అవగాహన కల్పించుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.కొమురయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ హరీష్ రాజ్, మున్సిపల్ కమిషనర్ లు మహబూబాబాద్ – ప్రసన్న రాణి, మరిపెడ- గణేష్ బాబు, డోర్నకల్-కె.వెంకటేశ్వర్లు, , తొర్రూర్-జి.బాబు, ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి దశరథ్, తహసిల్దార్లు, విద్యుత్, ఆర్ అండ్ బి, మత్స్య శాఖ, అగ్నిమాపక, ఆర్.టి.ఓ. కార్యాలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post