గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలి- అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్

.
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు , సంబంధిత అధికారులతో గణేష్ ఉత్సవాల నిర్వహణపై అదనపు కలెక్టరులు ప్రతీక్జైన్,తిరుపతి రావు లు సమావేశం నిర్వహించారు .
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి పకడ్బందీ చర్యలను చేపట్టాలన్నారు. గణేష్ మండపాల వద్ద భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించేలా, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, దూరం పాటించేలా మండప నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల సహకారంతో ఉత్సవాలు నిర్వాహించాలన్నారు. గణేష్విగ్రహాల మండపాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీస్ అధికారులు అప్రమత్తగా ఉండాలని,పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తగంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు గణేష్ నిమజ్జనానికి సంబంధించి ప్రణాళిక
బద్దంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. నిమజ్జనం జరిగే చెరువుల వద్ద అవసరమైన క్రేన్ లను గజ ఈత గాళ్ళను అందుబాటులో ఉంచాలని, లైటింగ్, మంచి నీరు, విద్యుత్, పారిశుధ్యం, మెడికల్ సౌకర్యాలు ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనంకై వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గుంతలు లేకుండా మరమత్తులు చేపట్టాలని ఈఈ పి ఆర్కు తెలిపారు. బారికేడ్లను ఏర్పాటు చేయాలని, విధ్యుత్తు తీగల సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. నిమజ్జన ప్రాంతాలలో అన్నివసతులతో, సిబ్బందితో, అంబులెన్సులతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలనీ వైద్యాధికారులను ఆదేశించారు.జిల్లా యంత్రాగం, ఉత్సవ కమిటీ , అధికారులు సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా పని చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ హరిప్రియ, ఎల్.బినగర్ డి.సి.పి, మాదాపూర్ డి.సి.పి వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం,కందుకూరు ఆర్డీఓ వెంకటాచారి, షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనరులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు .

Share This Post