వార్త ప్రచురణ
తేదీ.18.09.2021.
ములుగు జిల్లా
గణేశ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దిశ నిర్దేశం మేరకు వినాయక నిమజ్జనాన్ని విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు ఒక ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు. ఈ యొక్క నిమజ్జనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ యొక్క నిమజ్జనాన్ని జరుపుకోవాల్సిన దిగా కలెక్టర్ అన్నారు.
ఈ మధ్య కురిసిన అధిక వర్షాల వలన జిల్లాలోని అన్ని వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని చెరువులు, రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ఆదివారం నాడు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లలో మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్ఐ, మండల ప్రత్యేక అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామనిజిల్లా కల్లెక్టర్ అన్నారు. జిల్లా రెవెన్యూ మరియు పోలీసు యంత్రాంగానికి సంబంధిత గణేష్ మండళ్ల అసోసియేషన్ మెంబెర్స్, ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ అన్నారు.