గణేష్ నిమజ్జనానికి పక్కాగా అన్ని ఏర్పాట్లు – కలెక్టర్

పది రోజుల పాటు ప్రజల నుండి పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం ప్రకారం స్థానిక దుబ్బ ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్రగా వెళ్లే వినాయక రథాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, నగర మేయర్ నీతూ కిరణ్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ నిమజ్జనం పాయింట్ల వద్ద ప్రమాదాలకు తావు లేకుండా క్రేన్లను ఏర్పాటు చేశామని గజ ఈతగాళ్లను నిర్మించామని బారికేడ్లు ఏర్పాటు చేశామని అందువల్ల నిమజ్జనం లో పాల్గొన్న ప్రజలు యువకులు అత్యంత జాగ్రత్తగా నిమజ్జనం జరిగే విధంగా ముందస్తు జాగ్రత్తలతో వెళ్లాలని తొందర పడవద్దని ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేసుకొని ఇండ్లకు వెళ్లాలని ఆయన కోరారు.

జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి వినాయకుడు మంచి చేస్తాడని ప్రతి ఒక్కరి నమ్మకని, చిన్నాపెద్ద తేడా లేకుండా నిమజ్జనములో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొంటారని, జిల్లా ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని బంగారు తెలంగాణ తో పాటు ఆరోగ్య తెలంగాణ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోఉ మహమ్మారి 16 నెలలు జనాలను తల్లడిల్ల చేసి తగ్గిందని, థర్డ్ వేవ్ రాకుండా గణేశుని కోరుకుంటున్నానని అన్నారు. మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాటిని అనుసరించి ఈసారి పండుగ ప్రశాంత వాతావరణంలో చాలా ఉత్సాహంగా వినాయక నిమజ్జనం జరుపుకుంటుందన్నారని, చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు గణేష్ రథము వద్ద గణేష్ మండలి అధ్యక్షుడు గణేష్ చేత జెండా ఊపించి రథాన్ని ప్రారంభించారు. అక్కడే ఉన్న బాలగంగాధర్ తిలక్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్/ మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా , ఆర్డిఓ రవి తహసిల్దార్ ప్రశాంత్ కుమార్, ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post