గణేష్ నిమజ్జనానికి మెరుగైన ఏర్పాట్లకు సంబంధిత శాఖధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె. శశంక

గణేష్ నిమజ్జనానికి మెరుగైన ఏర్పాట్లకు సంబంధిత శాఖధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలి::జిల్లా కలెక్టర్ కె. శశంక

ప్రచురణార్ధం:
ఆగష్టు 30, మహబూబాబాద్.

గణేష్ నిమజ్జనానికి మెరుగైన ఏర్పాట్లకు సంబంధిత శాఖధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశంక అధికారులను ఆదేశించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమిజ్జనం ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా కాన్ఫరెన్స్ హాలులో సూపరింటెన్డెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్, స్థానిక సంస్థల కలెక్టర్ అభిలాష్ అభినవ్ తో కలిసి సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించి ఏర్పాట్లపై పలు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31 న వినాయక విగ్రహాలను ప్రతిష్టిస్తారని అట్టి విగ్రహాల అంచానా మేరకు జిల్లాలో నిమజ్జన ఏర్పాట్లకు గాను ఆయా శాఖల అధికారులు నిమజ్జన ప్రదేశాలాను సందర్శించి అవసరమైన ఏర్పాట్లకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నిమజ్జన ప్రదేశాలలో విద్యుత్ సౌకర్యం, పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి వసతి, పార్కింగ్, వైద్య బృందాలు, 108 అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ఆయా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మహబూబాబాద్, తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీ పరిదిలలో నిమజ్జన ప్రదేశాలను గుర్తించి విగ్రహాలను తరలించే సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రూట్ మ్యాపును సిద్దం చేసుకోవాలని పోలీస్ అధికారులను కలెక్టర్ సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్ళను సిద్దoగ ఉంచాలని అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు ఏర్పాట్లు ఉండాలని సంబంధిత శాఖాధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యు డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎస్హెచ్ఓ లతో కూడిన అధికార బృదం నిమజ్జన ప్రాంతాలను సందర్శించి అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. గ్రామాలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారి ఎంపిడీఓ లు తగు ఏర్పాట్లు చేయాలనీ కలెక్టర్ అన్నారు. నిమజ్జనం రోజున విగ్రహాల ఊరేగింపు వాహనాలు, భక్తులు, ప్రజల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలని, జలశాయాలలో లోతైన ప్రదేశాలను గుర్తించి ప్రమాదాలు సంబవించకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని దీనితో పాటు రోడ్ల మరమ్మత్తు పనులను, అవసరమైన పారిశుద్ధ్య పనులను చేపట్టి నిమజ్జన ఏర్పాట్లకు సంసిద్దంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సూపరింటెన్డెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ గత సంవత్సర అనుభావాలను దృష్టిలో ఉంచుకొని గణేష్ నవరాత్రుల ఉత్సవాలు, నిమజ్జనం కొరకు ముందస్తు ప్రణాళిక తో శాంతి భద్రతల ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహ మండపాల వద్ద సిసి టివి కెమెరాల నిఘా ఉంటుందని, ఇప్పటికే పీస్ కమిటీ తో సమావేశం నిర్వహించడం జరిగిందని ప్రశాoత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం జరిగేటట్టు పటిష్ట బందోబస్త్ ఏర్పాట్లు చేపడుతున్నట్లు సూపరింటెన్డెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ గ్రామాలలో నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్య తదితర పనుల ఏర్పాట్లకు గాను మండల, గ్రామ స్థాయి అధికారులతో ముందస్తు ఏర్పాట్లకై తగు చర్యలు తీసుకున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రామాలలోని జలాశయాలను గుర్తించి నిమజ్జనానికి అవసరమైన ప్రదేశాలలో గణేష్ నిమజ్జనం కొరకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ జె. నరేష్, అగ్నిమాపక శాఖాధికారి డి. నాగేశ్వర్ రావు, మిషన్ భాగీరథ ఈఈ ఎ.సురేందర్, డిసిఎస్ఓ జి. నర్సింగరావు, డిఎఫ్ఓ ఎ. నాగమణి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమేష్ రాథోడ్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తానేశ్వార్, ఎక్సైజ్ అధికారి బి. కిరణ్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, పోలీస్ అధికారులు తోర్రూరు,మహబూబాబాద్ ఆర్దేఒ లు రమేష్, కొమురయ్య, మున్సిపల్ కమిషనర్లు కె. ప్రసన్న రాణి, కె శ్రీనివాస రావు, జి. బాబు ,తహసిల్దార్లు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post