గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలి…

ప్రచురణార్థం

గణేష్ నిమజ్జనోత్సవం కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 15.

గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఉత్సవ కమిటీని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం మహబూబాబాద్ పట్టణం లోని నిజాం చెరువు ప్రాంగణంలో చేపడుతున్న గణేష్ నిమజ్జనం కార్యక్రమ ఏర్పాట్లను మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. పట్టణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులకు సహకరించాలన్నారు.

అధికారులు భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలన్నారు విద్యుత్కు అంతరాయం లేకుండా నిరంతరం సరఫరా జరిగేలా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు నిమజ్జనోత్సవం కు తగిన ఏర్పాట్లు మైకు టెంటు కుర్చీలు త్రాగునీరు వంటి ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కొమరయ్య తాసిల్దార్ రంజిత్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు ఉన్నారు
———————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయనైనది

Share This Post