గతంలో నిరుపేదల అవాసాలకు ఉద్దేశించి సేకరించిన కేటాయింపులు జరుగని ప్రభుత్వ భూమిని గుర్తించి కాపాడాలని జిల్లా కలెక్టర్- పి. ఉదయ్ కుమార్

పత్రిక ప్రకటన
తేది: 20-3-2023
నాగర్ కర్నూల్ జిల్లా.
గతంలో నిరుపేదల అవాసాలకు ఉద్దేశించి సేకరించిన కేటాయింపులు జరుగని ప్రభుత్వ భూమిని గుర్తించి కాపాడాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ మండలంలో ని సింగోటం, పెంట్లవెల్లి లో క్షేత్ర స్థాయిలో పర్యటించి గతంలో సేకరించిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ గతంలో ఎస్సి ఎస్టీ లు, బి.సి లకు ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు దాదాపు అన్ని మండలాల్లో ప్రభుత్వ భూమిని సేకరించిందని, వివిధ కారణాల వల్ల కొన్నింటిలో ప్రభుత్వం స్థలం కేటాయించిన అక్కడ ఇళ్లు నిర్మించుకోకపోవడం మరికొన్నింటికి కేటాయింపులే చేయకుండా ఉండిపోయాయని తెలిపారు. అలాంటి ప్రభుత్వ స్థలాలను గుర్తించి తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకు ఇతరులు అక్రమించుకోకుండా కాపాడాల్సిన బాధ్యత తహసిల్దార్ ల పై ఉందని తెలియజేసారు.
సంబంధిత తహశీల్దార్లు, ఇతర సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
—————–

Share This Post