గతంలో లోంగిపొయున మావోయిస్టులకు పునరావాస ఏర్పాటు కింద ఇండ్ల పట్టాలను జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ అందజేశారు


పత్రిక ప్రకటన:-
సిద్దిపేట 19 నవంబర్ 2022

శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో గతంలో లోంగిపొయున మావోయిస్టులకు పునరావాస ఏర్పాటు కింద ఇండ్ల పట్టాలను జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ అందజేశారు. ఇటివల జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆప్ పోలిస్ ల ఆద్వర్యంలో నిర్వహించిన కమిటి సమావేశంలో మావోయిస్టుల పునరావాస ఏర్పాట్ల గురించి చర్చించారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు 1. రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ కి దుళ్మిట్టలో, 2. ముత్తన్నగారి జలంధర్ మరియు 3. కొమ్ముగల్ల లక్ష్మణ్ లకి సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి లో ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఈ ముగ్గురికి కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్ లతో కలిసి కలెక్టర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.
issued by district public Relations office Siddipet

Share This Post