ప్రచురణార్థం
వరంగల్
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
శుక్రవారం రోజున కలెక్టర్ చాంబర్లో అన్నారం దర్గా
ఉర్సు ఉత్సవాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నారం దర్గా ఉర్సు
ఉత్సవాలు ఈనెల 7 వ తారీకు నుండి 9వ తారీఖు వరకు 03 రోజులు జరుగుతాయని ఆ ఉత్సవాలలో ప్రభుత్వపరంగా కల్పించాల్సిన సౌకర్యాలపై మండల స్థాయి ఆఫీసర్స్ మానిటరింగ్ చేసుకుని కమిటీ సభ్యులతో సంప్రదించుకొని ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా చూడాలన్నారు
పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయాలని మైనారిటీ శాఖ ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలు’ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా హెల్త్ క్యాంప్ ఏర్పాటు ‘ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా లైటింగ్ ఏర్పాటు…ఫైర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేటట్లు…టి ఎస్ ఆర్ టి సి ద్వారా ఉరుసు ఉత్సవాలకు జనాల రద్దీ దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత ఎక్కువ బస్సులు నడపాలని…
జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో శానిటేషన్ పై చర్యలు తీసుకోవాలని అందరి అధికారుల సమన్వయంతో ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మహేందర్, జి డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ,పోలీస్ మైనారిటీ
ఎలక్ట్రిసిటీ ఆర్టీసీ,
ఫైర్
సంబంధిత అధికారులు పాల్గొన్నారు