గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్సి, ‘ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

ప్రచురణార్థం

వరంగల్ జిల్లా

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్సి, ‘ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు
గురువారం రోజున జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో ఎస్ ఎస్ సి,ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ ,ఎస్ఎస్సి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించడానికి చర్యలు చేపట్టామని ఇంటర్మీడియట్ పరీక్షలు ఈనెల 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 14 వరకు కొనసాగుతాయని 27 సెంటర్స్ ల లో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు
అలాగే జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తేదీ 3 .4 .2023 నుండి13-04-2023 వరకు జరుగుతాయని..పరీక్షా సమయం ఉదయం 9-30 నుండి12-30 వరకు ఉంటుందని అన్నారు

ఈ సంవత్సరమునకు గాను జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలలో293 పాఠశాలల నుండి 9,728 రెగ్యులర్ అభ్యర్థులు (5013) విద్యార్థులు మరియు4715 బాలికలు పరీక్షలు హాజరవుతారని మరియు 27 మంది ప్రవేట్ అభ్యర్థులు హాజరవుతారని అన్నారు

పరీక్ష నిర్వహణకు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా సంబంధిత శాఖలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా తగు సలహాలు సూచనలు ఇచ్చారు

ముఖ్యంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పరీక్షలు నిర్వహించే సెంటర్స్ లలో ఏఎన్ఎం లను కేటాయించి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా ఆదేశించారు

అదేవిధంగా ప్రతి పరీక్ష కేంద్రాన్ని శానిటేషన్ లో భాగంగా పరిశుభ్రంగా ఉంచేందుకు జిల్లా పంచాయతీ అధికారిని ని ఆదేశించారు

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామినేషన్ సెంటర్స్ లలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అలాగే ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ ఎక్కువగా ఉంచుకోవాలన్నారు

అలాగే ప్రతి పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వర్కింగ్ కండిషన్లో ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

పోలీస్ శాఖ ద్వారా పటిష్ట బందోబస్తు నడుమ చర్యలు తీసుకోవాలని…. ఆర్టీసీ ద్వారా ఎక్కువ విద్యార్థులు హాజరయ్యే ప్రదేశాలలో ఎక్కువ బస్సులు నడిపే విధంగా చూడాలని… విద్యుత్ శాఖ ద్వారా పరీక్షలు జరిగే తేదీలలో విద్యుత్ నిలిపివేయకుండా చూడాలని అన్నారు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతం గా నిర్వహించాలని ఆయన అన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్స కోట, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి
సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Share This Post