గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా, సాఫీగా నిర్వహించుటలో సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇంటర్మీడియేట్ పరీక్షలు సజావుగా, సాఫీగా నిర్వహించుటలో సంబంధిత అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ తెలిపారు.

మే 6 నుండి 24 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం 59,694, రెండో సంవత్సరం 55,672 మంది విద్యార్థుల హాజరు కానున్నారని ఇందుకోసం 156 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కోర్టు హాల్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లప్లై లైన్ డిపార్ట్మెంట్స్ అయినా విద్య, వైద్య, రెవిన్యూ, పొలిసు, విద్యుత్, ఆర్.టి.సి. పోస్టల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో డిఆర్ఓ హరిప్రియ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరపూ జనరల్ ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఇట్టి పరీక్షలు సాఫీగా నిర్వహించుటకు ఒక తహశీల్ధార్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్ తో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, నలుగురు జూనియర్ లెక్చరర్ లతో సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను, 35 మంది సభ్యులతో కస్టడీయన్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 29 పోలీస్ స్టేషన్ లలో భద్రపరుస్తున్న ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించుటకు, సెక్యూరిటీ ఏర్పాటు చేయడంతో పాటు, 156 పరీక్షా కేంద్రాలకు అవసరమైన పొలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయవలసినదిగా పొలిసు అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, సమీప జిరాక్స్ కేంద్రాలను మూసివేయించాలని, 12 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయాలని, సున్నిత, అతి సున్నిత కేంద్రాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా రెవిన్యూ అధికారులను కోరారు. పరీక్షలకు సాఫీగా నిర్వహించుటకు అవసరమైన సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా కేటాయించవలసినదిగా విద్యాశాఖాధికారి సూచించారు . వేసవి కాలం దృష్ట్యా ప్రతి కేంద్రము వద్ద ప్రాథమిక చికిత్స అందించుటకు అవసరమైన మందులు, ఓ.ఆర్ .ఎస్. ప్యాకెట్లతో ఏ.యెన్.ఏం. లను ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని, విద్యుత్ లో అంతరాయం కలగకుండా చూడవలసినదిగా విద్యుత్ అధికారులను కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి వెంక్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, పోలీసు శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post