గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం 2లక్షల 20వేల ఉద్యోగాల భర్తీ చేస్తోంది శుభకృత నామ సంవత్సరాన్ని సిఎం కేసిఆర్ ఉద్యోగ నామ సంవత్సరం చేశారు నూతన జోనల్ విధానం వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తన తండ్రి పేరుమీద పెట్టిన ట్రస్టు ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడం అభినందనీయం ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించాలి కోచింగ్ కేంద్రాల్లో ఆడపిల్లలు అధికంగా ఉండడం చూస్తే సంతోషం వేస్తోంది రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం 2లక్షల 20వేల ఉద్యోగాల భర్తీ చేస్తోంది  శుభకృత నామ సంవత్సరాన్ని సిఎం కేసిఆర్ ఉద్యోగ నామ సంవత్సరం చేశారు  నూతన జోనల్ విధానం వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి తన తండ్రి పేరుమీద పెట్టిన ట్రస్టు ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వడం అభినందనీయం  ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించాలి  కోచింగ్ కేంద్రాల్లో ఆడపిల్లలు అధికంగా ఉండడం చూస్తే సంతోషం వేస్తోంది  రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్ 25: తెలంగాణ రాష్5ప్రభుత్వం గత 8 ఏండ్లలో 2 లక్షల 20 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి, మరో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ 90వేల ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసిన నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తన తండ్రి గండ్ర మోహన్ రెడ్డి పేరు మీద పెట్టిన ట్రస్టు ద్వారా అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి ముందుకు రావడం నిజంగా అభినందనీయమన్నారు. ఈ కోచింగ్ కార్యక్రమం సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడి, వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కోచింగ్ సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధిస్తే ఇదే ప్రాంతంలో కుటుంబాలతో కలిసి సక్సెస్ మీట్ పెట్టుకుందామని ప్రోత్సహించారు. ఎమ్మెల్యే అంటే నియోజక వర్గ బాధ్యతతో పాటు, మీ వ్యక్తిగత అవసరాలు కూడా తీరుస్తున్నారన్నారు. వారి తండ్రి పేరుమీద ఏర్పాటు చేసిన ట్రస్టును తనయుడు గౌతమ్ రెడ్డి నిర్వహిస్తూ, ఉచిత కోచింగ్ ఇస్తున్నందున, అభ్యర్థులు కష్టపడి చదివి, అనుకున్న ఉద్యోగం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. తండ్రి బాటలో పయనిస్తూ శ్రీమంతుడి వలె సొంత ప్రాంతానికి సేవ చేస్తున్న గౌతమ్ రెడ్డిని కొనియాడారు. గత రెండేళ్లలో కరోనా వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తమ విలువైన కాలాన్ని కోల్పోయారని, తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది శుభకృత నామ సంవత్సరం అందరికీ శుభం తెచ్చిందన్నారు. దీనికంటే ముందే సిఎం కేసిఆర్ 90వేల ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చి, ఈ సంవత్సరాన్ని ఉద్యోగ నామ సంవత్సరంగా చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో మన నిధులు మనం ఖర్చు చేసుకోవడం వల్ల గతంలో లేని పథకాలు నేడు మనకు అమలవుతున్నాయన్నారు. తాజాగా ఉద్యోగాలను కూడా భర్తీ చేసుకుంటున్నామని చెప్పారు. వివిధ బోర్డుల ద్వారా నియామకాలు చేసుకుంటున్నామని, ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. పోలీసు బోర్డు, గురుకుల బోర్డు, టిఎస్ పిఎస్సీ ద్వారా ఇప్పటికే లక్షా 33వేల 942 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నామన్నారు. 91వేల 142 ఉద్యోగాలకు భర్తీ చేసుకోవాలని ఖాళీలను గుర్తించి, ఇందులో 11 వేల 103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసుకుంటున్నామన్నారు. మిగిలిన 80,039 పోస్టులను నేరుగా భర్తీ చేసుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు బాగా వస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు అన్యాయం జరుగొద్దని రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ ద్వారా సిఎం కేసిఆర్ నూతన జోనల్ విధానం తీసుకొచ్చారని, దీనివల్ల జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలని విభజించి భర్తీ చేసుకుంటున్నామన్నారు. ఫలితంగా స్థానికులకే ఉద్యోగాలు ఎక్కువగా రానున్నాయన్నారు. గతంలో కొద్దిగా మంచిగా చదువుకున్న వారు ఎక్కడైనా ఉద్యోగాలు సాధించి, పోస్టింగ్ విషయంలో భూపాలపల్లి, ములుగు రావడానికి వెనుకాడేవారన్నారు. నూతన విధానం వల్ల ఇక ఈ బాధ ఉండదన్నారు. భూపాలపల్లి జిల్లాకు వచ్చే 918 ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే వస్తాయని, వీటితో పాటు మల్టీ జోనల్, జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు కూడా మనం పోటీ పడవచ్చన్నారు. నేడో, రేపో గ్రూప్ 1 నోటిఫికేషన్ రానుందని, దేనికి తాము తక్కువ కాదని, అభ్యర్థులు అన్ని పరీక్షలు రాయాలని సూచించారు. కోచింగ్ ఉచితంగా ఇస్తున్నారని నిర్లక్ష్యం చేయవద్దని, దీనిని సీరియస్ గా తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత కోచింగ్ సెంటర్ లో మంచి భోజనం, పుస్తకాలు, మంచి ఫ్యాకల్టీ పెట్టి శిక్షణ ఇప్పిస్తున్నారని, మీ తల్లిదండ్రులు ఏ ఆశయంతో ఇక్కడకు పంపించారో అది నెరవేరాలంటే మీరు కష్టపడి చదవాలని అభ్యర్థులకు చెప్పారు. ఇన్నేళ్లు చదువుకుంది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చదివే చదువు ఒక ఎత్తుగా భావించాలని, మీకు ఇచ్చిన మెటీరియల్ ను సరిగ్గా అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఆరు నెలల్లో అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయి, కాబట్టి బాగా చదివి, ఉద్యోగాలు సాధించి, ఇక్కడే మీ కుటుంబ సభ్యులతో కలిసి సక్సెస్ మీట్ పెట్టుకుందామని ప్రోత్సహించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, ఉద్యోగాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తోందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులకు గొప్ప వేతనాలు మన రాష్ట్రంలోనే ఇస్తున్నామన్నారు. ఒక్కరు ఉద్యోగం పొందితే ఆ కుటుంబం అంతా బాగుపడు తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే నియమకాలతో పాటు కేంద్రం కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తే అందులో కూడా మనవారికి ఉద్యోగాలు వచ్చి బాగుపడుతారని తెలిపారు. కోచింగ్ కేంద్రంలో ఆడపిల్లలు అధిక సంఖ్యలో ఉండడం చూస్తే సంతోషంగా ఉందన్నారు. కుటుంబాన్ని సమన్వయం చేస్తూ అన్నింట్లో నేటి మహిళ రాణిస్తున్నది అన్నారు. ఎవరికి లేని సహనం మహిళకు ఉంటుందని, అందుకే భగవంతుడు అంతటా ఉండలేక ఆడపిల్లను సృష్టించాడు అనే మంచి పేరు ఉందన్నారు. కాబట్టి ఉద్యోగ నియమకాల్లో ఆడపిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె. స్వర్ణలత, ట్రస్టు నిర్వాహకులు గండ్ర గౌతమ్ రెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post