50 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

50 రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

గత రబీలో కరోనా ఉన్నా లక్ష్యాన్ని మించి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జిల్లా యంత్రాగానికి ఎంతో సహకరించారని , ఈ వానా కాలం పంట కొనుగోలులో కూడా అదే ఉత్సావంతో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసి విజయవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ ప్రాథమిక సహాకార సంఘాల అధ్యక్షులు, రైస్ మిల్లుల యజమానులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో వరి ధాన్యం కొనుగోలు పై రైస్ మిల్లుల యాజమానులు, ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వానాకాలంలో 5 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని, అందుకనుగుణంగా ఐ.కె.పి , పి.ఏ. సి ఎస్., మార్కెటింగ్ శాఖల ద్వారా 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమను కొలిచే యంత్రం, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచి పర్యవేక్షణకు వ్యవసాయాధికారులను, వ్యవసాయ విస్తరణాధికారులను నియమించడంతో పాటు ప్రతి 15-20 కేంద్రాలకు ప్రత్యెకా ధికారులుగా ఏం.పి.డి.ఓ., ఏం.పి.ఓ. లను ఏర్పాటు చేశామని అన్నారు. ట్రాన్స్పోర్టర్లు వేయి లారీలను సమకూర్చాలని, రైస్ మిల్లర్లు తమకు ధాన్యం కేటాయించే కెపాసిటీ కు అనుగుణంగా హమాలీలను చేసుకోవాలని, మిల్లుకు వచ్చిన 24 గంటల లోగా ధాన్యం అన్ లోడ్ చేసి ట్రక్ షీట్ ఇస్తూ, ఖాళీ గన్ని బ్యాగులను సమీప కేంద్రాలకు చేరవేయాలని కోరారు. రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రా రైస్ మిల్లులకు, ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించడానికి అవకాశమున్నదని, మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం కామారెడ్డి, బోధన్, చర్లపల్లి వంటి ప్రాంతాలలో భద్రపరచుటకు, మిల్లింగ్ అయిన ధాన్యాన్ని సనత్ నగర్ ఇతర ప్రాంతాలలో తరలించుటకు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నామని అన్నారు. గత రబీలో 36 బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించగా ఈ ఖరీఫ్ లో దానికి తోడు 111 రా రైస్ మిల్లులున్నందున లోడింగ్, అన్ లోడింగ్ కు ఇబ్బంది ఉండకపోవచ్చని 50 రోజులలోగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కావచ్చని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నవంబర్ మాసంలో కేంద్రాలకు ధాన్యం విరివిగా వచ్చే అవకాశమున్నందున ఏ.ఈ.ఓ.లు అప్రమత్తంగా ఉంది రైతులు విడతలవారీగా కేంద్రాలకు తాళ్లు లేకుండా, 17 శాతం తేమ మించకుండా క్లీన్ గా తెచ్చే విధంగా అవగాహన కలిగించాలని సూచించారు. ఈ పరిస్థితులలో రైతులకు సహనం , ఓర్పు ఎంతో అవసరమని పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని సూచించారు. తూకంలో తేడా రాకుండా రైతులు, రైస్ మిల్లర్లు నష్ట పోకుండా , ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. రెండు, మూఢు రోజులల్లో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ బీహార్ హమాలీలను ఎక్కువగా పెట్టుకొని అన్ లోడింగ్ సక్రమంగా చేయాలని, తరుగు రాకుండా చూడాలని, ఏమైనా సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తామని అన్నారు. నిర్థారించిన కేంద్రాలలోనే కొనుగోళ్లు జరగాలని ఉప కేంద్రాలు పెట్టవద్దని, కొత్తగా కొన్న రెండు వేల టార్పాలిన్లు అందజేస్తున్నామని, ఇంకా అవసరమైతే కొనుగోలు చేయాలని, గన్ని సంచులు అవసరం మేరకు అందజేస్తుంటామని తెలిపారు. సన్న బియ్యం, దొడ్డు బియ్యాన్నీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ 1960, సాధారణ రకం 1940 రూపాయలకు కొనుగోలు చేస్తామని అన్నారు.

 

రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు చంద్ర పాల్ మాట్లాడుతూ రా రైస్ మిల్లులు బియ్యం ఆడించడానికి సిద్ధంగా ఉన్నారని, తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కొత్త గన్ని బ్యాగులు అందించాలని, ధాన్యం తరుగు లేకుండా, తాలు లేకుండా చూడాలని కోరారు. ధాన్యం నిలువకు గోదాములు లేక ఇబ్బందులు పడుచున్నామని, బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లుచున్నామని, ఆ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, ఇంచార్జి సివిల్ సప్లై జిల్లా మేనేజర్ సాయి రామ్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, డి.సి.ఓ. కరుణ, డి.టి.ఓ. శ్రీనివాస్ గౌడ్, అడిషనల్ డి.ఆర్.డి.ఓ. భీమయ్య, ఫ్యాక్స్ అధ్యక్షులు, రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post