గత 20 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, ఇతర అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వాటిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లను ఆదేశించారు

గత 20 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, ఇతర అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున వాటిని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్లను ఆదేశించారు.  సోమవారం ఉదయం సహచర మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అంటువ్యాధులు, మలేరియా, డెంగ్యూ వంటివి ఎక్కువగా వస్తుంటాయని, ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.  అంటువ్యాధులు  నివారించేందుకు అవసరమైన మందులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.  అయితే వైద్య,  గ్రామీణ, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ దోమలను అరికట్టేందుకు, పారిశుధ్య పరంగా ఆన్నీ చర్యలు చేపట్టాలని అదే విధంగా యుక్త వయస్సు పిల్లలకు  రెండవ డోస్, 18 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ కోవిడ్ టీకా ఇచ్చేనెదుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు.  దోమల నివారణకు యాంటీ లార్వా ద్రావణం చల్లడం, బ్లీచింగ్ చల్లడం, మంచినీటి  క్లోరినేషన్, ఫాగింగ్ వంటి నివారణ చర్యలు చేపట్టాలని  తెలియజేసారు.  గ్రామాల్లో , మున్సిపాలిటీల్లో దోమల నివారణకు ప్రతి ఆదివారం మన ఇంట్లో శుభ్రం చేసుకుని వార్డుల్లో ఇతరుల ఇంట్లో సైతం శుభ్రత పాటించే విధంగా ఇల్లిల్లు తిరిగి ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టాలని ఇందులో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  అన్ని విద్యాలయాలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో  ప్రతి ఫ్రే డే ను డ్రై డే గా నిర్వహించాలని ఆ రోజు విద్యాలయంలో ఎక్కడ నిలువ నీరు లేకుండా, పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు ఆగకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.  కూలర్ లలో నిలువ నీరు లేకుండా, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, సీసాల మూకుడలు వంటి వాటిలో వర్షపు నీరు నిలువ ఉండటం వల్ల డెంగ్యూ దోమలు గుడ్లు పెడతాయని అందువల్ల అలాంటివి లేకుండా చూసుకోవాలని తెలియజేసారు.  తెలంగాణా లో ఒక మంకీ పాక్స్ అనుమానిత కేసు కామారెడ్డి లో నమోదు అయ్యిందని ప్రజలు అప్రమత్తంగా ఉంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల దీనిని నీవారించవచ్చన్నారు.  దినికొఱకు ప్రత్యేకంగా నల్లకుంటా ఫీవర్ ఆసుపత్రిని నోడల్ ఆస్పత్రిగా గుర్తించడం జరిగిందని ఎక్కడైన ఎవరికైనా జ్వరం, శరీరం పై మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హైదరాబాద్ లోని నల్లకుంటా ఫీవర్ ఆసుపత్రికి పంపించాలని సూచించారు.

ఈ విడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల నుండి ప్రాణనష్టం లేకుండా అన్ని ముందుజాగ్రత్తలు పాటించి జిల్లా యంత్రాంగం  సమర్థవంతంగా పనిచేసాయని, అయితే ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందన్నారు. నిలువ నీరు, మురుగు కాలువలు, అపరిశుభ్రత వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని దీనిని నివారించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అంటువ్యాధుల నుండి కాపాడవలసిన బాధ్యత ఉందన్నారు.  గ్రామాల్లో పంచాయతి అధికారులు, ఎంపిడిఓ లు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేసి ప్రజలకు అంటువ్యాధుల నివారణ పై అవగాహన  కల్పించడంతో పాటు పలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.  మిషన్ భగీరథ వారు మంచినీటి ట్యాన్క్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, ఎక్కడా తాగునీరు లీకేజీ లు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  తాగు నీటిని వేడి చేసుకొని చల్లార్చి తాగడం మంచిదన్నారు.  గ్రామాల్లోని షాపులు,బస్టాండ్, ఇతర ప్రజలు గుమ్మికుడే ప్రాంతాల్లో పారిశుధ్యంగా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రజలు మాలమూత్ర విసర్జనలు బయట  చేయకుండా చూడాలని, అలాంటి వారిపై జరిమానాలు విధించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.

విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ  ప్రస్తుతం కొన్నిచోట్ల  విద్యార్థుల వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు జ్వరాలు వస్తున్నట్లు గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని ప్రత్యేక అధికారులను నియమించి నివారణ చర్యలు చేపట్టేవిధంగా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్లు సందర్శించి వైద్యం చేయడం వసతి గృహాల పరిసరాల్లో దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.  పాఠశాలల్లో, వసతి గృహాల్లో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు.  జిలా విద్యా శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని, ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవలన్నారు.

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంటువ్యాధులు ప్రబలకుండా  అన్ని జాగ్రత్తలు చేపట్టేందుకు సకాలంలో అధికారులతో ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  జిల్లాలలో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురి కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భోజనం విషయంలో  పిల్లలకు  నాణ్యమైన భోజనం పెట్టించాలని ప్రతిరోజు వార్డెన్లు అక్కడే పిల్లలతో పాటు భోజనం చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వసతి గృహాలు, పాఠశాలలకు పాత బియ్యం కాకుండా సన్న రకం కొత్త బియ్యం సరఫరా చేయాలని పాతవి ఉంటే తిరిగి తీసుకోని మార్చాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు.  పిల్లలకు మంచి భోజనం అందేవిధంగా చర్యలు తీసుకోవలన్నారు.

స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, గిరిజనులు నివసించే ప్రాంతాల్లో నిలువ నీరు చేరడం వల్ల దోమలు, అంటువ్యాదులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఇలాంటి ప్రాంతాల్లో దోమల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సూచించారు.  గిరిజన సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలు గుర్తించడం జరిగిందని అధికారులు బాధ్యతలు తీసుకొని పిల్లలకు నాణ్యమైన భోజనం అందజేసేవిధంగా చర్యలు  తీసుకోవలన్నారు.  ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అధికారులు తరచుగా పర్యటించి భోజనం నాణ్యత పరిశీలించాలని సూచించారు. గిరిజన సంక్షేమ పాఠశాలలకు దగ్గర్లోని పి.హెచ్.సి ల నుండి వైద్యులు వెళ్లి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ దోమల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు.  అదేవిధంగా గత కొంతకాలంగా రైస్ మిల్లుల నుండి ఎఫ్ సి.ఐ. బియ్యం సేకరణ నిలుపుదల చేయడం వల్ల రైస్ మిల్లులో ధాన్యం ఉండిపోయిందన్నారు.  ఇప్పుడు తిరిగి సేకరణ ప్రారంభించినందున  రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం తో రెండు షిప్టులు పనిచేసి యుద్ధప్రాతిపదికన బియ్యం చేసి ఎఫ్.సి. ఐ.కి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డి హరిచందన  మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు అమలు చేస్తామని, దోమల నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. వ్యాక్సినేషన్ సైతం ఇంకా మిగిలిపోయిన వారికి రెండవ డోస్ ఇవ్వడం, 18 సంవత్సరాలు నిండిన వారికి బూస్టర్ డోస్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలుయజేశారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి, జిల్లా వైద్యదికరి డాక్టర్ రామమనోహర్ రావు, డి.పి.ఓ మురళి, బి.సి. సంక్షేమ అధికారి కృష్ణమ చారి,MPDO లు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post