పత్రికా ప్రకటన తేది:23.11.2022, వనపర్తి.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గరుడ పుష్కరిణి పునరుద్ధరణ, తడి, పొడి చెత్తల సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
గురువారం ఐ డి ఓ సి. జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో గ్రీన్ టీమ్ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి “గరుడ పుష్కరిణి బావి” ని పునరుద్ధరించడానికి గ్రీన్ టీమ్ సభ్యులను సమన్వయం చేసుకొని పునరుద్ధరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఆయన ఆదేశించారు. పుష్కరిణినీ శుభ్రపరచి, అందుబాటులోకి తీసుకురావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని తడి, పొడి చెత్త సేకరణపై గ్రీన్ టీం సభ్యులు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ టీమ్ సభ్యులు కృష్ణ క్యాసాని, దివ్య, తేజ, సి.వెంకటస్వామి, జి.రాంబాబు, శంశాంక్, రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.