గరుడ యాప్ పై బి.యల్.ఓ లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఈవియం గోదాం మొదటి అంతస్తుకు ప్రతి ప్రతిపాదనలు పంపండి. ఈవియం గోదాం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంకా గోయల్.

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో ఈవియం ల భద్రత కొరకు ఈవియం గోడములను నిర్మించి అందుబాటులోకి తేవడం జరిగిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంకగోయల్ అన్నారు. బుధవారం స్థానిక కుడ కడ నూతన కలెక్టరేట్ పరిధిలో  రూ. కోటి ముప్పై లక్షలతో నిర్మించిన ఈవియం గోదామును జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హైద్రాబాద్ మినహా నూతన జిల్లాలో 22 ఈవియం గోడములను గాను 20 ఇప్పటికే ప్రారంభించామని మిగతా 2 గోదాముల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో  ఎన్నో ఎన్నికలు జరిగాయని ఎక్కడకూడా ఎలాంటి సమస్య, ఇబ్బందులు లేకుండా సమర్డగవంతంగా నిర్వహించారని జిల్లా అధికార యంత్రాంగాన్నీ అభినందించారు. జిల్లాలో నిర్మించి అందుబాటులో ఉన్న ఈవియం గోడములలో ఈవియం, వి. వి.ప్యాడ్స్ భద్రపరుచుటకు ఎంతో ఉపయోగం పడుతుందని అన్నారు. పై అంతస్తు నిర్మాణం తో ఇక్కడే ఈవియం ల మొదటి స్థాయి పరిశీలన చేయడం జరుగుతుందని అన్నారు. ఈసీఐ దేశ వ్యాప్తంగా గరుడ యాప్ కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆదిశగా బి.యల్.ఓ లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఇప్పటికే మొదటి దఫా శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.  భవిషత్ లో  ఏ ఎన్నికలైన సజావుగా నిర్వహించేందుకు ఇకపై ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈవియం గోడం మొదటి అంతస్తుకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వ అనుమతితో  నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారు, ఒక ప్రాంతం నుండి వెళ్లిన వారి పేర్లను తొలగించాలని సూచించారు. 1.2.2022 నాటికి 18 సంవతసరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి ఓటరు జాబితాను పూర్తి స్థాయిలో తయారు చేయాలని అన్నారు.
అనంతరం  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు మార్పులు, చేర్పులు కు సంబందించి  10,764 అందాయని వాటిలో 9874 పరిష్కరించమని మిగతా 917 దరఖాస్తులను త్వరలో పరిశీలిస్తామని అన్నారు. . నిర్మించిన గోడంలో ఈవియం, వివిప్యాడ్స్ భద్రపరుచుటకు సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. జిల్లా అంతటా గరుడ యాప్ పై బి.యల్.ఓ లకు మొదటి దఫా శిక్షణ ఇచ్చామని అలాగే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, ఆర్.డి.ఓ లు కిషోర్ కుమార్, రాజేంద్ర కుమార్, వెంక రెడ్డి, తహశీల్దార్లు, ఎన్నికల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, ఈ. ఈ యాకుబ్, డి.ఈ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post