గర్బీణి స్త్రీల వివరాలను నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

గర్బీణి స్త్రీల వివరాలను నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 0 0 0

     జిల్లాలోని గర్బీణి స్త్రీలను గుర్తంచి వారి వివరాలను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

     శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గర్బీణీ స్త్రీల నమోదు, సీజనల్ వ్యాదులు మరియు రక్త హీనత అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రదానంగా పట్టణాలలో గర్బీణి స్త్రీ వివరాల నమోదు చాలా తక్కువగా ఉందని, అంగన్ వాడి సూపర్ వైజర్లు పట్టణ , గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి గర్బీణీ స్త్రీలను గుర్తించి వారి వివరాలు నమోదు చేయాలని, పట్టణాలలో గర్బీణి స్త్రీ వివరాల నమోదు చాల వెనకబడిపోయినందున స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు ఆరోగ్య శాఖల సిబ్బంది పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారుల సమన్వయంతో వందశాతం గర్బీణి స్త్రీల నమోదు జరగాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రమంగా సీజనల్ వ్యాదులు, డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని, అన్ని గ్రామాలలో మరియు పట్టణాలలో ప్రతి మంగళవారం మరియు శుక్రవారాలలో పెద్దఎత్తున డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రానున్న కాలంలో కేసులు పెరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ర్తకహీనత పరీక్షలు నిర్వహించి ఏ శీల్డ్ (A SHEILD) యాప్ లో నమోదు చేయాలని, సాదారణ రక్త హీనత మరియు తీవ్రస్థాయి రక్త హీనత వారిని గుర్తించి ఐరన్ మాత్రల ద్వారా చికిత్స చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్యాధికారి జవేరియా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నమాల, స్తీ శిశు సంక్షేమ అధికారి పద్మావతి, సిడిపిఓలు, ప్రోగ్రాం అధికారుల, వైద్యాదికారులు, అంగన్ వాడి సూపర్ వైజర్లు తదితరులు పాల్గోన్నారు.

Share This Post