గర్భస్త శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

గర్భస్త శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-19:

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం ను పటిష్టంగా అమలు పరిచి ఆడపిల్లల శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో PC-PNDT చట్టం అమలు తీరును వైద్య అధికారులతో, కమిటీ సభ్యులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు ఆలస్యంగా గర్భం ధరించినప్పుడు, జన్యుపరమైన రుగ్మతలు ఉన్న సందర్భంలో, తరచుగా గర్భస్రావాలు అయిన సందర్భంలో పిండం పరిస్థితిని తెలుసుకోవడానికి, తల్లిదండ్రులకు ఏమైన రుగ్మతలు ఉన్న సందర్భంలో పిండ పరీక్షలు తెలుసుకొని పిండానికి సంబంధిన ఆరోగ్య పరిస్థితులను తెలుసు కోవడానికి సాంకేతిక పరీక్షలు చేయించుకోవాలని, అలా కాకుండా, పిండం లింగ నిర్ధారణ కొరకు పరీక్షలు చేయించు కున్నట్లయితే పరీక్షలు చేయించిన వారితో పాటు, చేసినవారు, సంబంధిత ఆసుపత్రి, ల్యాబ్ యాజమాన్యంపై, డాక్టర్లపై, నిపుణుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

పి.సి. పి.ఎన్. డి.టి. చట్టం గర్భం ధరించడానికి ముందు, తర్వాత పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణను నిరోదిస్థుందని, సంబంధిత గర్భిణీకి, ఆమె బంధువులకు బిడ్డ లింగ వివరాలను వెల్లడించడం నిషేధమని తెలిపారు.

గర్భస్త పిండ దశలోనే ఆడ శిశువని తెలిసి నిర్భయంగా అబార్షన్ చేస్తున్నవారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ, గ్రామాల్లో సిబ్బంది విస్తృతంగా పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని,
ఆర్. ఎం. పి. వైద్యులు గర్భం దాల్చిన మహిళలకు ఇదివరకు ఆడపిల్లలు ఉన్నారా అనేవిషయాన్ని తెలుసుకొని వారిని సంప్రదిస్తున్నారని, అలాంటి వారిపై గ్రామస్థాయిలో పోలీసుల సహకారంతో వైద్య సిబ్బంది దృష్టి పెట్టారని తెలిపారు.

రాష్ట్రంలో జనరల్ పాపులేషన్ లో ప్రతి వెయ్యి మందికి 988 ratio ఆడవారు కలిగి ఉన్నారని,
మహబూబాబాదులో ప్రతి వెయ్యి మందికి 1067 ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో 0-6 వయస్సు గల 1000 మగవారికి 932 ratio ఆడవారు ఉన్నారని, మహబూబాద్ లో 0-6 వయసు ఉన్న మగవారికి 885 ఆడ పిల్లలు ఉన్నారని తెలిపారు.

జిల్లాలో 2020 ఏప్రిల్ 1 నుండి 2021ఆగస్టు 19 వరకు జరిగిన ప్రసవాల లో ఆడపిల్లలను జన్మనిచ్చిన ప్రతి వెయ్యి మందిలో 873 రేషియో ప్రకారం ఆడ పిల్లల తల్లిదండ్రులకు కేసీఆర్ కిట్లను అందించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్కు వివరించారు.

ఇప్పటి వరకు జిల్లాలో 37 అల్ట్రా సౌండ్ సెంటర్ లు ఉండగా, 22 పనిచేస్తున్నాయని, ఒకటి ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 28న మరోసారి సమావేశమై సమీక్షించనున్నట్లు, అధికారులు అందరూ సమగ్ర నివేదికలతో హాజరుకావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, డి.డబ్ల్యు.ఓ. స్వర్ణలత లేనిన, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ బి వెంకట్ రాములు, డాక్టర్ జగదీశ్వర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే. వెంకటయ్య, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ఎస్ నాగవాని, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కమలాకర్, 1098 హెల్ప్లైన్ మెంబర్ టి వెంకటేష్, డాక్టర్ అంబరీష్, డాక్టర్ మురళి, డాక్టర్లు, కమిటీ సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————
జిల్ల పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post