గర్భస్థ శిశువులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది, బ్రోచర్ ను ఆవిష్కరించిన : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:23.09.2021.
వనపర్తి.
గర్భస్థ శిశువును కాపాడాల్సి బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసిన బ్రోచర్ లను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని జిల్లా కలెక్టర్ సూచించారు. (PC, PNDT Act. 1994) ప్రకారం గర్భాధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించుకున్న వారికి, ప్రోత్సహించిన వారికి చట్టరీత్యా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.50,000/- జరిమానా విధించబడుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు.
గర్భస్రావాలు, బ్రూణ హత్యలు నివారించాలని, గర్భస్థ శిశువులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి (DPHO) డాక్టర్ రవి శంకర్, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post