గర్భిణీలకు సేవా భావంతో వైద్య సేవలు అందించాలి

గర్భిణీలకు సేవా భావంతో వైద్య సేవలు అందించాలి

అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి గర్భిణీల వివరాలను నమోదు చేయాలి

అనీమియా ముక్త్ కరీంనగర్ సాధించేందుకు జిల్లాలో “ఏ షీల్డ్  యాప్ ”

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

             0 0 0 0

       వైద్యులు గర్భిణీలకు సేవా భావంతో వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

      శుక్రవారం కలెక్టరేట్ సమవేశ మందిరంలో వైద్యాధికారులు,అంగన్వాడి సూపర్వైజర్ లతో జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రులలో గర్బిణీల నమోదు మరియు సాధారణ కాన్పుల పై అదనపు కలెక్టర్ తో కలిసి ఆయన  సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీలు  ప్రైవేటు ఆసుపత్రులలో ప్రసవాల కొరకు  సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయించుకునేలా వైద్య మరియు అంగన్వాడి  సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.   ఇతర ప్రాంతాల నుండి జీవనోపాది కొరకు వచ్చిన కార్మికులపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, అంగన్వాడి సూపర్ వైజర్లు, టీచర్లు మరియు ఆశా కార్యకర్తలు గర్బిణీలు  తీసుకునే ఆహారం, వారి ఆరోగ్య పరీస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటు ముందస్తుగా తీసుకోవలసిన వైద్యం గురించి అవగాహ కల్పించాలని  అన్నారు.  కరోన సమయంలో వైద్య మరియు ఆశా, అంగన్వాడి లు అందించిన సేవలు అభినందననీయమని అదే విధంగా ఇప్పుడు కూడా వారి సేవలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.  గర్భిణీ వివరాలను నమోదు చేయాలని,  ప్రాథమిక అరోగ్య కేంద్రాలలో ప్రసవాలు జరిగిన అనంతరం వారికి లభించే కేసిఆర్ కిట్ మరియు ఇతర ప్రోత్సహకాల పై అవగాహన కల్పించాలని సూచించారు.   రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిగా కరీంనగర్ జిల్లాలో అనిమియా ముక్త్ కరీంనగర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా రక్తహీనతతో ఎ మహిళ కూడా బాధపడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.  దీని కొరకు ప్రత్యేకంగా “ఏ షీల్డ్ యాప్ “ను రూపొందించడం జరిగిందని దీనిపై ఆశాలకు శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.  ప్రతి పిహెచ్ సి వారిగా గర్బీణీల వివరాలను సేకరించి పిహెచ్ సి లలో ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ఓపిల వివరాలను నమోదు చేయాలని,  పిహెచ్ సి లలో ల్యాబ్ టెక్నీషిన్లు అందుబాటులొ లేనట్లయితే ఆశాలను వినియోగించుకోవాలని సూచించారు.

     అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారికి ప్రైవేటు ఆసుపత్రులలో కాకుండా ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేవలు అందించేలా చూడాలని, ఎటువంటి సమస్యలు లేని అరోగ్య కేంద్రాలగా తీర్చిదిద్దాలని, అవసరమైతె వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్య సహాయాన్ని అందించాలని సూచించారు. 14 – 55 సంవత్సరాల మద్యగల మహిళలు రక్తహీనత కారణంగా అనారోగ్య సమస్యలతో బాదపడతుంటారని అలా జరగకుండా అనిమియాను ముందస్తుగానే గుర్తించి వారికి సరైన వైద్య సహాయాన్ని అందించేందుకు రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా కరీంనగర్ జిల్లాలొ ” అనిమియా ముక్త్ కరీనంగర్ ” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ఇందుకొరకు  “ఏ షీల్డ్ యాప్ “ను రూపొందించడం జరిగిందని  పేర్కోన్నారు.  ఈ యాప్ గురించి ప్రతి ఆశా, ఎఎన్ఎం లకు శిక్షణను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.   శిక్షణ అనంతరం వారు ఇంటింటికి వెళ్లి రక్తహీనత పరీక్షలు నిర్వహించేలా కిట్ ను అందించడం జరుగుతుందని, అనిమియా బాధితులకు కావలసిన ఐరన్ మాత్రలను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.  పోషన్ అభియాన్ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాలని,  తల్లి పాలను పిల్లలకు అందించడంపై  అవగాహనను కల్పించాలని సూచించారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జూవేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన  ఆసుపత్రి సూపరింటెండెంట్  డాక్టర్ రత్నమాల, డాక్టర్ అలీమ్, వైద్యాధికారులు, సి డి పి వో లు, అంగన్వాడి సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post