గర్భిణీ బాలింతలు తమ శిశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

భువనగిరి పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  గర్భిణీ  స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  గర్భిణీ బాలింతలు తమ శిశువుల ఆరోగ్యం కోసం  5 సూత్రాలు పాటించాలని,  బిడ్డ మొదటి 1000 రోజులు అత్యంత కీలకమైనవిగా గ్రహించాలని,  అధిక పోషకాలు గల ఆహారం తీసుకోవాలని,  రక్తహీనతకు గురికాకుండా  జాగ్రత్తలు పాటించాలని,  విరేచనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,  పరిశుభ్రత పారిశుద్ధ పద్ధతులు పాటించడం వలన గర్భిణీ బాలింతలు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు అన్నారు. అదేవిధంగా  పిల్లల ఎదుగుదల గురించి ఈ నెల మొత్తం అంగన్వాడి కేంద్రం పరిధిలో, మండలంలో కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపినారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కృష్టయ్య,  సీడబ్ల్యూసీ చైర్మన్ బండారు జయ శ్రీ,  జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్ర రావు,  సి డి పి ఓ  స్వరాజ్యం, సూపర్వైజర్ లలిత, తదితరులు  పాల్గొన్నారు.
గర్భిణీ బాలింతలు తమ శిశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు.

Share This Post