* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి 05 ఆగస్టు (గురువారం).
గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యాధికారులు ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు.
గురువారం రేగొండ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి kovida టీకాలు ఫస్ట్ డోస్, second dose, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గదిని పరిశీలించి ల్యాబ్ రిపోర్ట్ మందుల నిల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ల్యాబ్ టెక్నీషియన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు సాయంత్రం వరకు మందుల నిల్వలను క్రమపద్ధతిలో పెట్టుకొని పరిశుభ్రంగా ఉంచి సంబంధిత ఫోటోని వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మతుల నిమిత్తం మంజూరైన 30 లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏ ఏ పనులు చేపట్టారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టిక, మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. క్రమశిక్షణ గా విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణ ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగాలని, అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని, శానిటేషన్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రేగొండ తాసిల్దార్ జీవాకర్ రెడ్డి, వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జరిచేయనైనది.