పత్రిక ప్రకటన
తేది :04.11.2022
నిర్మల్ జిల్లా శుక్రవారం
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, తీసుకోవలసిన జాగ్రత్తలు సాధారణ ప్రసవాలు జరిగేలా గ్రామాల్లో ని ప్రజలకు అవగాహన
కల్పించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ
శుక్రవారం ఖానాపూర్ మండలం లోని గోసంపల్లి, కడెం మండలం లోని తహసీల్దార్ కార్యాలయం లో
సాదారణ ప్రసవాలపై ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ
జిల్లాలో ఎక్కువగా 90 శాతం సిజెరియన్ ఆపరేషన్ లు జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలు జరిగేలా కుటుంబ సభ్యులు తమ సహాయ సహకారాలు అందించాలని మార్పు దిశగా అడుగులు వేయాలని అన్నారు.
గర్భిణి గా ఉన్న వారిని గమనించి వెంటనే నమోదు చేసి గర్భిణీ నమోదు నాలుగు వారాల లోపు నమోదు అయ్యేలా చూడాలని, గర్భిణీ స్త్రీలకు రక్తహీనత నివారణ టాబ్లెట్స్ , వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిగా సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సాధారణ ప్రసవాల పట్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు అవగాహన కలిగిఉండాలని, ముహూర్తం ప్రకారం సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించకుండా నార్మల్ డెలివరీలు చేయించుకోవాలని, దీని వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉండడం తో పాటు ఆరోగ్యం గా ఉంటారని తెలిపారు.
డాక్టర్ స్వాతి, రంజిత లు
గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్త ల పై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ గజానాన్, సర్పంచ్ అనూష లక్ష్మి, డాక్టర్ కామేష్, జడ్పి కో అప్షన్ మెంబర్ రఫిక్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.