గాంధీజీ చూపిన అహింస మార్గమే గొప్పది…

ప్రచురణార్థం

గాంధీజీ చూపిన అహింస మార్గమే గొప్పది…

మహబూబాబాద్ అక్టోబర్ 2.

జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస మార్గమే గొప్పదని, 130 కోట్ల మంది ఉన్న భారతీయుల నందరిని ఒకతాటిపై నడిపేందుకు చట్టాలు మాత్రమే చాలవని ఉద్యమాన్ని ఎంచుకున్న మహానుభావుడని జిల్లా కలెక్టర్ శశాంక కీర్తించారు.

శనివారం కలెక్టర్ కార్యాలయంలో లో అక్టోబర్ 2వ తేదీ, జాతిపిత మహాత్మా గాంధీ 152వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నమస్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమం సాధనలో విభిన్న మతాలు కులాలు భాషలతో సమ్మిళితం గా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో చట్టాలు మాత్రమే చాలవని దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపించేందుకు ఉద్యమం అవసరమని అది కూడా డా అహింస మార్గంలో ఎంచుకున్న జాతిపిత మహాత్మా గాంధీ మహనీయులుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.

వారి ఆశయ సాధన లో కొన సాగుతూ సాధించిన స్వాతంత్ర్య ఫలాలను సామాజిక బాధ్యతతో భావితరాలకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు.

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి తీసుకున్న నిర్ణయాలు ఎంతగానో దోహదపడ్డాయని అన్నారు.
నిజాయితీకి నిబద్ధతకు నిలువుటద్దంలా నిలిచారన్నారు ఐఏఎస్ అకాడమీ లాల్ బహుదూర్ శాస్త్రి పేరుమీద ఏర్పాటు చేయటం గర్వించదగ్గ విషయమన్నారు మహానుభావులు గా కీర్తి గాంచిన మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి ఒకేరోజు జన్మించడంతో ఇరువురి జన్మదినోత్సవాలను ఒకే రోజున నిర్వహించుకుంటునట్లు కలెక్టర్ తెలియజేశారు.

అనంతరం మహాత్మా గాంధీ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష్ అభిలాష్ కొమురయ్య శిక్షణ కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పరికిపండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post