గాంధీజీ స్పూర్తితో దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని,ప్రజాస్వామ్య విలువలను జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.

నల్గొండ, సెప్టెంబరు 27.  గాంధీజీ స్పూర్తితో దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని,ప్రజాస్వామ్య విలువలను
జీవితాంతం పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాల్లో అన్ని దశల్లోనూ స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అన్నారు.  కొండా లక్ష్మణ్‌ బాపూజీ దేశం గర్వించదగ్గ గొప్ప నేత అని కొనియాడారు. అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితమంతా కృషి చేశారని తెలిపారు
  సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో  కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాపూజీ నిస్వార్థ సేవలను స్మరించుకొన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూ జీ ఆశయాలను ప్రభుత్వం నెరవేరుస్తున్నదని తెలిపారు.
బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని తెలిపారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులను అందజేస్తూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ కార్యాలయం  పరిపాలన అధికారి మోతీ లాల్,కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ చందన వదన,కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post