గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్


గాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
00000

    జాతీపిత మహత్మాగాంధీ ఆశయాలను, ఆదర్శాలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

     ఆదివారం మాహత్మాగాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని గాంధీ విగ్రహానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యగ్రహమే అయుధంగా అహింస, శాంతి మార్గములో దేశానికి స్వాతంత్య్ర సముపార్జ చేసిన మహానీయుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. వారు చూపిన మార్గములో పయణించి దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని అన్నారు.

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, , రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్, , కలెక్టరేట్ పరిపాలన అధికారి నారాయణ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post