గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధనలో కళాకారులు బాగస్వాములు కావాలి
ప్రజలను ప్రేరెపితులను చేసి ఉత్తేజ పరిచే నైపుణ్యం కళాకారులకు ఉంటుంది.
కళాకారులకు ఉద్యోగం కల్పించి, ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన రాష్ట్రం తెలంగాణ
తూటాగాయాలను సైతం మైమరిపించే వందేమాతర నినిదాం ఉన్న ఎకైకదేశం భారతదేశం
తెలంగాణ గాంధీ కేసిఆర్

మానకొండూర్ శాసన సభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్
0 0 0 0 0
ఆనాడు స్వరాజ్యం కోసం కళాకారులు ప్రజలను ఏవిధంగా జాగృతులను చేశారో, అదే విధంగా సాంస్కృతిక ళాకారులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలోభాగస్వాములు కావాలని మానకొండూర్ శాసన సభ్యులు, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు.
ఆదివారం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపద కళాకారుల ప్రదర్శని కార్యక్రమంను నగర మేయర్ వై సునీల్ రావు, సిపి, అదనపు కలెక్టర్లతో కలిసి కరీంనగర్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జెండా ఊపి ర్యాలీ ని ఆయన ప్రారంభించారు. టిఎస్ఎస్ కళాకారులు, చిందు యక్షగానం , ఒగ్గు ,కోలాటం, అమరవీల స్థూపం నుండి కలెక్టరేట్ ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశ ఔనత్యాన్ని, వజ్రోత్సవ మహోత్సవాన్ని కళల ద్వారా చెప్పాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశానుసారం కరీంనగర్ లో జానపద కళాకారుల ప్రదర్శని కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కళాకారులు ప్రదర్శించిన కళారూపాలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మానకొండూర్ శాసన సభ్యులు, తెలంగాణా సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లడుతూ 75 సంవత్సరాల స్వతంత్రం పూర్తిచేసుకున్న శుభ సందర్బంగా నిర్వహించుకుంటున్న వజ్రోత్సవాల సందర్భంగా అధికారులకు, కళాకారులకు, విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రజలందరికి శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో ప్రజలను ప్రేరేపితులను చేసిన ఘనత కళాకారులకె దక్కుతుందని అన్నారు. స్వతంత్ర పోరాటనిరతిని ప్రజల్లో ప్రేరేపితులను చేసి జాగృతలను చేసేలా ఆ రోజుల లోనే బంకింగ్ చంద్ర ఛటర్జీ మొదటి సారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించి ప్రజలను ఉత్తేజభరితులను చేసారని తెలిపారు. ఒక్క వందేమాతరం ద్వారా సువిశాల భారతదేశ ఔనత్యాన్ని, సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచం నలుమూలల చాటడంతో పాటు, జలియన్ వాలాబాగ్ మారణకాండలో తూటాల గాయాలను సైతం మైమరిపించేలా వందేమాతరం నినాదం మారు మ్రోగిందని అన్నారు. అవమానం, అణచివేత నుండి ఎగసిపడిన నినాదమే జైబోలో స్వతంత్ర భారత్ అని అన్నారు. క్విట్ ఇండియా నినాద స్పూర్తితో, ఆనాడు క్విట్ తెలంగాణ ఉద్యమం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రపంచం మొత్తం అభిమానించే అహింసావాది మహాత్మాగాంధీ అని, అహింసావాదంతో స్వతంత్రాన్ని సాధించిన దేశం భారతదేశం ఒక్కటేనని అన్నారు. దేశంకోసం ప్రాణాలను ఆర్పించిన వారి త్యాగాల ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామని అన్నారు. తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన శ్రీకాంతచారి, యాదయ్య మొదలగు తెలంగాణ అమరవీరులను గుర్తుచేసుకుందామని అన్నారు. నిన్నమొన్నటి వరకు ప్రముఖులు జెండా ఎగురవేస్తే చూసెవాళ్లమని, 75 సవంత్సరాల వజ్రోత్సవాల సందర్బంగా రాష్ట్రముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రతి ఇంటింటికి ఒక జాతీయ జెండాను ఇచ్చి దానిని ఎగురవేసె అద్బుత అవకాశాన్ని మనందరికి కల్పించారని కోనియాడారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా చూద్దామన్న లేని అందమైన దేశం భారతదేశమని,6ఋతువులు,3 కాలలతో సుసంపన్నమైన దేశం భారతదేశం అని అన్నారు. దేశం కోసం ఒక సైనికుడు ఏవిధంగా కష్టపడుతున్నాడో అదేవిధంగా మనందరం ఒక సైనికునిలా దేశం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ ఏ ప్రభుత్వ కళాకారులకు ఉద్యోగాలను ఇచ్చిన దాఖలాలు లేవని, కేవలం ఒక్క తెలంగాణలో మాత్రమే 570 మంది సాంస్కృతిక కళాకారులకు ఉద్యోగం కల్పించి, ప్రభుత్వంలో భాగస్వాములను చేయడం జరిగిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాద్యత సాంస్కృతిక కళాకారులదే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, సుడాచైర్మన్ జి.వి. రామకృష్ణా రావు, నగర పోలీస్ కమీషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జి.వి. శ్యాంప్రసాద్ లాల్, జిల్లా అధికారులు జిల్లా ప్రణాళిక అధికారి కొమరయ్య,పిడి మెప్మా రవీందర్, డిపిఆర్ఓ అబ్దుల్ కలీం, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజా వీరు, జిల్లామార్కెటింగ్, సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు,ఎల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్ , వివిధ శాఖల అధికారులు, తహసిల్దార్ సుధాకర్,కళాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.