గాంధీ సినిమా ఉద్దేశ్యాన్ని, స్ఫూర్తిని తీసుకొని జీవితంలో ఎదగాలి….. రాష్ట్ర గిరిజిన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథొడ్.

గాంధీ సినిమా ఉద్దేశ్యాన్ని, స్ఫూర్తిని తీసుకొని జీవితంలో ఎదగాలి….. రాష్ట్ర గిరిజిన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథొడ్.

ప్రచురణార్థం

కష్టపడి, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని సమాజంలో గౌరవప్రదంగా ఉండాలి

మహబూబాబాద్, ఆగస్ట్ -10:

గాంధీ సినిమా ఉద్దేశ్యాన్ని, స్ఫూర్తిని తీసుకొని జీవితంలో ఎదగాలని, అలాగే కష్టపడి, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకొని సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మేల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి స్థానిక సూర్య కళామందిర్ సినిమా టాకీస్ లో గాంధీ చిత్రాన్ని విద్యార్థిని, విద్యార్థులతో కలిసి చూసారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారతావని స్వేచ్చా వాయువులు పీల్చుకుని 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను స్మరించుకునే విధంగా,వారి పోరాట పటిమను గుర్తుచేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ మంచి టీంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని వారిని అభినందించారు.

గాంధీ చిత్ర ప్రదర్శన సమయంలో మంత్రిని చూసి పిల్లలు కేరింతలు కొట్టగా వారిని ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి సినిమా చూసి ఉత్సాహాన్ని నింపారు. పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులతో మాట్లాడుతూ, 75 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం వచ్చినప్పుడు, అలాగే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు మీరందరూ పుట్టలేదని, దేశానికి స్వాతంత్య్రం ఏ విధంగా సిద్ధించింది, వాళ్లు ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, 75 ఏళ్ల ముందే వారు ఎంత నీతివంతంగా, హింసకు తావులేకుండా అహింసా మార్గంలో పోరాడారో తెలుసుకోవాలని, దీని నుంచి స్పూర్తి పొందాలని, దేశానికి మీరు భావి, భారత పౌరులని, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని, స్వాతంత్య్రం సాధించుకున్న దేశాన్ని ఏ దిశలో తీసుకెళ్లాలి అనే ఆలోచించి, అందులో మన పాత్ర ఏమి అని, ఎవరికి వారు ఎవరో చేసి పెడ్తారు అని కాకుండా, అందరిని సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని వెళ్లినప్పుడు ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు అని, మరి మనం చిన్నవాళ్లం ఏమి చేయగలం అని ఆలోచించకుండా, మన తల్లిదండ్రులు చదువుకొని ఉండరూ, మనం మారుమూల గ్రామాల్లో, తండాల్లో పుట్టిన బిడ్డలుగా మన తల్లిదండ్రులకు తెలియని విషయాలను తెలియజెప్పి అందరూ ఒక సమైక్య స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, 22వ తేదీ వరకు ఈ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఈ చిత్రంలోని సందేశాన్ని, ఇందులో ఉన్న అర్ధాన్ని మనం అన్వయించుకొని మన జీవితానికి వెలుగు బాటలు వేసుకోవాలని దీని అర్ధం అని తెలియజెప్పారు.

ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ లు ఉన్నత చదువులు చదివి ఉన్నతస్థానంలో ఉన్నారని, ప్రతి పరీక్షలో ముందుండి మనల్ని పాలించే గొప్ప అవకాశం వచ్చిందని, మీరు వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలాని ఒక తల్లిగా దీవిస్తున్నానని తెలిపారు. రోజు జరిగే కార్యక్రమాలను చూసి మీకు ఉపయోగపడే సందేశాన్ని, ఉపయోగపడే అవకాశాలను, స్వాతంత్య్రం, గొప్ప నాయకుల చరిత్రను తెలుసుకుంటే మీ జీవిత ప్రయాణంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సినిమా చూసి దీని నుండి మంచిని గ్రహించి మీ జీవితానికి అన్వయించుకోవాలని కోరారు.

ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కష్టపడి స్వాతంత్య్రం తీసుకవచ్చారని, ఇవ్వాల స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అని, మూడు లక్షల 50 వేల త్యాగాలపై సాధించిన ఈ భారత దేశ స్వాతంత్య్రం ఎలా ఉండాలి, మన చరిత్ర తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ గాంధీ సినిమా చూపించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పిల్లవానిపై లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నదని, కార్పోరేట్ స్థాయిలో విద్య నందిస్తున్నదని, మంచిగా చదువుకొని బాగా ఎదగాలి అని ప్రభుత్వం చూస్తుందని, ప్రేమ, అనురాగాలతో ఉండాలని, గురువు, తల్లిదండ్రులపట్ల గౌరవంతో ఉండాలని, సమాజంలో ఎలా ఉండాలి అనేదే ఈ సినిమా ఉద్దేశ్యం అని, సెల్ ఫోన్ లు వాడవద్దని, కష్టపడి, ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్పి సదయ్య, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మునిసిపల్ వార్డ్ కౌన్సిలర్ మారనేని వెంకన్న, ఆర్డిఓ కొమురయ్య, తహసిల్దార్ నాగాభవాని, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post