గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం MG రోడ్ లోని గాంధీ విగ్రహం జరుగుతున్న అభివృద్ధి పనులు, గాంధీ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేస్తున్న 16 ఫీట్ల గాంధీ విగ్రహ పనులను, బహిరంగ సభ జరిగే ఆసుపత్రి ప్రాంగణం లో ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ GHMC కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, IG విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ CP రంగనాథ్, నార్త్ జోన్ DCP చందన దీప్తి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, HMDA SE పరం జ్యోతి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ముందుగా ఉదయం 10.30 గంటలకు ఎంజి రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తారని చెప్పారు. అక్కడి నుండి పార్క్ లైన్, ప్యాట్నీ సిగ్నల్, క్లాక్ టవర్, సంగీత్, చిలకలగూడా చౌరస్తా మీదుగా గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీ విగ్రహన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన గొప్ప దార్శనికుడు గాంధీ మహాత్ముడు అని పేర్కొన్నారు. గాంధీ జయంతి రోజున ఆయన్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ఆయన స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రం సాధించారని చెప్పారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు, I&PR CIEO రాధాకృష్ణ, R&B SE హఫీజుద్దీన్, RDO వసంత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి   తదితరులు ఉన్నారు.

Share This Post