గిరిజనులకు వరం ‘గిరివికాసం’:: కలెక్టర్ బి.గోపి

సీఎం గిరి వికాస్ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోనవాల్సిందిగా జిల్లా కలెక్టర్ బి.గోపి తెలిపారు.

బుధవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నందు గిరి వికాసం పథకం మీద సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన గిరిజనులు సీఎం గిరి వికాస్ పథకం క్రింద బోరుబావుల మంజూరు గురించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ద్వారా అట్టి ప్రతిపాదనలను పంపవలసిందిగా కలెక్టర్ సూచించారు.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందుటకు షెడ్యూల్ ట్రైబ్స్ అయివుండి ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న వారు అర్హులని కలెక్టర్ తెలిపారు.

రైతులు ఈ పథకం గురించి మండల పరిషత్ అభివృద్ధి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని.. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవలని.. ఇందుకు తగ్గట్టు గా అధికారులు గిరిజన ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు .

ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ PD సంపత్ రావు, జె .డి అగ్రికల్చరల్ ఉషోదయాల్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, మరియు షెడ్యూల్ ట్రైబ్స్ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు..

Share This Post