గిరిజనుల సమస్యలపై పోరాటం జరిపిన మహోన్నత వ్యక్తి కొమురం భీం -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆదిలాబాద్ ఆదివాసుల జిల్లా అని, గిరిజనుల ఆరాధ్య దైవం కొమురం భీం వర్ధంతిని నిర్వహించుకోవడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కొమురం భీం 81 వ వర్ధంతి సందర్బంగా బుధవారం రోజున స్థానిక ప్రయాణ ప్రాంగణం ఎదురుగా ఉన్న కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా కొమురం భీం వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఎక్కువ శాతం ఆదివాసులు నివసిస్తున్నారని, ఆదిలాబాద్ ఆదివాసుల జిల్లా గా పేరుగాంచిందని తెలిపారు. గిరిజనుల సమస్యలపై పోరాటం జరిపిన మహోన్నత వ్యక్తి కొమురం భీం అని అన్నారు. జిల్లాలోని గిరిజనుల సమస్యలు పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీ నగేష్, పలువురు గిరిజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post