గిరిజన అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్షా : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా
సెప్టెంబర్ 23( గురువారం )

గిరిజన అభివృద్ధి సంక్షేమ పథకాలు గిరిజనులకు అందాలంటే అధికారులు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జి ప్రాజెక్ట్ అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు
గురువారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ప్రాజెక్టు అధికారి విధుల్లో భాగంగా ఏటూరునాగారం ఐ టి డి ఎ ను సందర్శించి గిరిజన అభివృద్ధి పథకాలపై అధికారులతో శాఖల వారీగా సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన అభివృద్ధి పై ఐటీడీఏ అనేక సంక్షేమ పథకాలు వారికి సకాలంలో అందించాలంటే అధికారులు వారి యంత్రాంగం ద్వారా అభివృద్ధి పథకాల పూర్తి సమాచారం నివేదికలను ఎప్పటికప్పుడు ఈ ఆఫీస్ లో నమోదు చేసి సమగ్ర సమాచారాన్ని తెలియజేయాలని అన్నారు ఇంజనీరింగ్ శాఖ ద్వారా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమాచారాన్ని తెలియజేయాలన్నారు అధికారులు సిబ్బంది ప్రతిరోజు సమయపాలన హాజరు నమోదు ఆన్లైన్ యాప్ లో పొందుపరిచి సమాచారం తెలియజేయాలన్నారు

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో జనరల్ వసంతరావు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post