గిరిజన ,గిరిజనేతర కుటుంబాలకు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం పోడు భూములకు హక్కు కల్పించడానికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది.జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

ప్రచురణార్థం
ములుగు జిల్లా:
నవంబర్ -06 , ( శనివారం )
గిరిజన ,గిరిజనేతర కుటుంబాలకు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం పోడు భూములకు హక్కు కల్పించడానికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించిందని మనసుపెట్టి పనిచేసి ప్రభుత్వ నిబంధనల మేరకు హక్కు పత్రాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.
శనివారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు పోడు భూములు అటవీ సంరక్షణ, పల్లె ప్రగతి పై సంబంధిత తాసిల్దార్ లు ,ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రెటరీ వీఆర్ఏ వీఆర్వో లకు ఆర్ఓ ఎఫ్ ఆర్ చట్టం ప్రకారం గిరిజన గిరిజనేతర ప్రజలకు పోడు భూములకు హక్కులు కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగాఅవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనదని అన్నారు.

ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మనసు పెట్టి పని చేసి అర్హత కలిగిన గిరిజన గిరిజనేతర ప్రజలకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పోడు హక్కు పత్రాలు వచ్చే విధంగా చూడాలని ములుగు జిల్లా అధిక మొత్తంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉన్నదని, ఈ జిల్లా లో 5.63 లక్షల ఎకరాల అటవీ భూమి ఉండగా అందులో 10 శాతం అటవీ భూమి పోడు కల్టివేషన్ లో ఉన్నదని తాడువాయి మంగపేట, ఏటూరునాగారం లో 55 వేల ఎకరాలు ఎం క్రోచ్ మెంట్ ఆయనదని అటవీ అధికారుల ద్వారా నివేదికలు తెలుపుతున్నాయని , తద్వారా గ్రామ ప్రజలకు పోడు కల్టివేషన్ పై గ్రామ సభల ద్వారా వారికి అవగాహన చేయాలని అలాగే పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో మిగిలి ఉన్న అటవీ భూములను రక్షించాల్సిన బాధ్యత కూడా గ్రామ ప్రజల పై ఉన్నదని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి కొత్తగా పోడు కొట్టడానికి ఎవరైనా చూస్తే వారిపై ఇండియన్ ఫారెస్ట్ రైట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ యాక్ట్, ఐ పి సి సి ఆర్ యాక్టర్ ల ,ప్రకారం బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు.

గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం ద్వారా అందించిన ప్రొఫార్మా లను అందించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని గిరిజనులకు అయితే 2005కు ముందు పోడు కల్టివేషన్ చేస్తూ ఆ గ్రామంలో స్థిరనివాసం ఉంటూ వారికి నిబంధనలు ఉంటాయని గిరిజనేతరులకు అయితే 75 సంవత్సరాలుగా ఆ గ్రామంలో శ్రీ నివాసం ఉంటూ పోడు కల్టివేషన్ చేసినట్లయితే ఆ గ్రామపెద్దల వాంగ్మూలం ప్రకారం సంబంధించిన దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి వారికి హక్కు పత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల అందరి దగ్గరా క్లెయిమ్స్ సేకరించాలని అనంతరం ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకల్లా రెవెన్యూ టీం క్షేత్రస్థాయి పర్యటనలు లో ఉండి సంబంధిత టీమ్స్ అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవాలని అన్నారు. అంతకుముందు ఎఫ్ ఆర్ సి గురించి గ్రామ సభల గురించి దరఖాస్తుల స్వీకరణ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారుఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్డీవో రమాదేవి, ఎస్ డి సి సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post