గిరిజన గ్రామాల్లో కోవిడ్ నివారణ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కోవిడ్ నేపథ్యం లో గిరిజన ప్రాంతాలలోని ప్రజలకు వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై కళాజాత కార్యక్రమాలను స్వచ్చంధ సంస్థల ఆర్థిక సహకారంతో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆగాఖాన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న కోవిడ్ ప్రచార రథాన్ని గురువారం రోజున కలెక్టరేట్ లో జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని గిరిజన కళాకారులను ఎంపిక చేసి గోండి, కోలం బాషలలో గిరిజన ప్రాంతాలలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తదితర అంశాలపై ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. ఆగాఖాన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో కళాకారులకు పారితోషకం, రవాణా, ఇతర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ప్రతి రోజు మూడు నుండి నాలుగు గ్రామాలలో ఈ కార్యక్రమాలను పది రోజుల పాటు ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించిన ప్రకారంగా గిరిజన గ్రామాలలో మొబైల్ వ్యాన్ ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రోగ్రాం మేనేజర్ పి.కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post