గిరిజన చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారుచేయటానికి పోషకాహార పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది:నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా
డిసెంబర్ 8 ( బుధవారం ).

పోషకాహారలోపంతో బాధపడుతున్నజిల్లాలో గిరిజన చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారుచేయటానికి పోషకాహార పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్ అన్నారు.
బుధవారం రోజున గట్టమ్మ దేవాలయం దగ్గరలో ప్రేమ్ నగర్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఎన్స్ప్రేయర్ నేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం లో భాగంగా నీతి అయోగ్ ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ న్యూ ఢిల్లీ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రాజెక్ట్ 2019-2020 కేంద్ర నిధుల ద్వారా ఐటీడీఏ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో 46 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టి పూర్తి చేసిన న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ ను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్ కుమార్ , డాక్టర్ రాజేశ్వరరావు ఐఏఎస్ స్పెషల్ సెక్రటరీ నీతి అయోగ్, రాకేష్ రంజన్ సీనియర్ కన్సల్టెంట్ నీతి అయోగ్ సభ్యులతో కలిసి ఎన్ ఆర్ సి సెంటర్ ప్రారంభానికి విచ్చేసిన వీరికి ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖ వారు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సెంటర్ ను ప్రారంభించి పోషకాహార సెంటర్లో వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు, డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ దారిద్య రేఖకు దిగువన ఉండి ములుగు జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతం కాబట్టి నాణ్యమైన పోషకాహారం తీసుకోవడం లో అశ్రద్ధ చూపడం వల్ల అవగాహన లేమితో గర్భిణీ స్త్రీలు రక్తలేమి తో ఉన్న చిన్నారులకు జన్మిస్తారని ప్రభుత్వ పరంగా పోషకాహార పునరావాస కేంద్రంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించడం తో పాటు వారి ఆరోగ్య పరిస్థితిపై గమనిస్తూ చికిత్స అందిస్తున్నామన్నారు.

అనంతరం ప్రేమ నగర్ లోని అంగన్వాడి సెంటర్ విజిట్ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ పిల్లలు వారికి స్వాగతం పలుకుతూ పూలమాలలతో నీతి ఆయోగ్ బృందానికి స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా మారుమూల గిరిజన ప్రాంతం అయినందున ఇక్కడ పిల్లలకు పౌష్ఠిక ఆహార లోపం లేకుండా పిల్లలకి ఎదుగుదలకు కారణమైన మంచి పౌష్టికాహారం అందించుటకు కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్వాడి సెంటర్ల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. పిల్లల్లో చైతన్యం తీసుకు నేందుకు చిత్రీకరణ రూపంలో బొమ్మల తో పిల్లలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించే విధంగా ఉండాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా పాలనాధికారి కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా,భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, ములుగు అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, భూపాలపల్లి అదనపు కలెక్టర్ దివాకర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Share This Post